సాధారణంగా బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ వాహనాలు ఉన్నట్టుండి ఆగిపోవటం మనం చూస్తుంటాం.. అప్పుడు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అందరూ కలిసి వాహనాన్ని నెట్టడం ద్వారా అది తిరిగి స్టార్ట్ అవుతుంది.. ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణంగానే మనం చూస్తుంటాం.. కానీ, ఎక్కడైనా రైలు ఆగిపోతే నెట్టడం మీరు ఎప్పుడైనా చూశారా..? అదేంటి విడ్డూరంగా రైలు ఆగిపోతే ఎలా నెడతారండీ అని ఆశ్చర్యపోతున్నారు కాదా.. కానీ, ఇపుడు వైరల్ అవుతున్న వీడియోలో ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పలువురు రైల్వే అధికారులు కోచ్‌ను మెయిన్ ట్రాక్ నుంచి లూప్ ట్రాక్‌పైకి మాన్యువల్‌గా నెట్టడం వీడియోలో కనిపించింది. క్లిప్‌లో చాలా మంది సిబ్బంది కోచ్‌కి ఒకవైపు గుమికూడి, ట్రాక్‌లను చుట్టుముట్టిన గరుకుగా ఉన్న కంకరలో నిలబడి స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లడం కనిపించింది.
నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ సంఘటన జరిగింది. నిహల్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన ట్రాక్‌పై డిపిసి కోచ్‌ని ఎక్కువగా చెక్ చేయడానికి ఉపయోగించే డిపిసి కోచ్ విరిగిపోవడంతో సాధారణ రైళ్లలో ఆలస్యం జరిగింది. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్ శర్మ వివరాలు వెల్లడించారు. రైల్వే అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక DPC రైలు గురువారం నిహాల్‌ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో చెడిపోయింది. దాన్ని వెంటనే అక్కడ్నుంచి ఎలా తొలగించాలని ఆలోచించిన సిబ్బంది వెంటనే.. రైల్వే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దానిని స్టేషన్‌కి నెట్టారు. ఆ తర్వాత రిపేర్ చేశారని తెలిసింది. అనంతరం రైలు గమ్యస్థానానికి చేరుకుంది.
#WATCH : Railway men made to push train coach after snag in UP's Amethi.
The incident happened in Uttar Pradesh's Amethi where a DPC coach, mainly used by Railway officials for inspection, broke down on the main line near the Nihalgarh Railway Station.#Amethi #IndianRailways… pic.twitter.com/2qlc7nE7f2— upuknews (@upuknews1) March 22, 2024
జరిగిన సంఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, ఈ ప్రాంతం రైల్వే కార్యకలాపాలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. రైల్వే పరిశ్రమలో కఠినమైన భద్రతా నిబంధనలు, నిర్వహణ అవసరాన్ని ఈ సంఘటన నిరూపిస్తుందని ఉద్యోగులు, స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..