
ఒడిశాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు దీనిని ‘ఎప్పటికైనా ఇదే అత్యంత అందమైన పరీక్ష క్షణం’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక విద్యార్థి డెస్క్ మీద నిద్రపోయాడు. అప్పుడు ప్రభాత్ కుమార్ ప్రధాన్ అనే ఉపాధ్యాయుడు ప్రతిస్పందించిన తీరు చాలా విలువైనది.
ఈ వైరల్ వీడియోలో పరీక్ష జరుగుతుండగా, ఒక విద్యార్థి డెస్క్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నట్లు మీరు చూడవచ్చు. ఆ బాలుడి అన్సార్ షీట్ , పేపర్స్ అన్నీ ముందు ముందు పడి ఉన్నాయి. అప్పుడు ఉపాధ్యాయుడు ప్రభాత్ కుమార్ నెమ్మదిగా ఆ స్టూడెంట్ దగ్గరకు వెళ్లి.. బాలుడి వీపును ప్రేమగా తడుముతూ మేల్కొలుపుతున్నాడు.
ఆ బాలుడు అకస్మాత్తుగా మేల్కొని చుట్టూ చూడగానే, తరగతి మొత్తం నవ్వడం ప్రారంభించింది. ఇది చూసి, టీచర్ కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. ఈ వీడియోను ప్రభాత్ సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @sir__prabhat_ నుంచి షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు లక్షలాది మంచి చూశారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు చదువు ఒత్తిడి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. చదువు ఒత్తిడి + నిద్రలేమి = పరీక్షలో అత్యంత అందమైన క్షణం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇలాంటి టీచర్ ప్రతి చోటా ఉంటే ప్రతిదీ అదుపులో ఉంటుందని చెప్పారు. మరొకరు ఆ స్టూడెంట్ ని తిట్టడానికి బదులుగా.. టీచర్ స్పందించిన తీరు.. అతను నవ్వు అందరి హృదయాలను గెలుచుకుకుందని కామెంట్ చేయగా.. పరీక్షా హాలులో ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..