Watch: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. సీసీటీవీలో మొత్తం సినిమా చూస్తున్న యజమాని..! ఆ తర్వాత జరిగింది..

|

Jan 03, 2025 | 8:12 PM

చేతులకు ముందుజాగ్రత్తగా  గ్లౌజులు ధరించిన దొంగలు సిసిటివిని చూస్తున్నారు. ఇది సోషల్ మీడియా వినియోగదారులను కడుపుబ్బ నవ్వుకునేలా చేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దొంగలు ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి ప్రతి క్షణాన్ని స్పష్టంగా గమనిస్తున్నాడు ఆ ఇంటి యజమాని. అది కూడా అతను దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో కూర్చుని తన ఇంట్లోకి ప్రవేశించిన దొంగల కదలికను తన మొబైల్‌లో చూస్తున్నాడు.

Watch: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. సీసీటీవీలో మొత్తం సినిమా చూస్తున్న యజమాని..! ఆ తర్వాత జరిగింది..
Homeowner Catches Thieves
Follow us on

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్నిసార్లు దొంగతనాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. కొన్ని చోరీ సంఘటనలు వింతగానూ, మరికొన్ని ఫన్నీగా కనిపిస్తాయి. కొందరు దొంగలు తప్పతాగి చోరీ చేసిన చోటే నిద్రపోయిన సంఘటనలు కూడా ఇటీవల వైరల్‌కావడం చూశాం. అలాగే, మరికొందరు దొంగలు తాము ఎత్తుకెళ్లిన వస్తువుల లిస్ట్‌ రాసిపెట్టిన సంఘటనలు కూడా చూశాం. అలాగే, మరికొందరు చోరీ కోసం వచ్చి ఇంట్లో వంట చేయటం, పూజ చేయటం కూడా చూశాం.. అలాగే, ఇక్కడ కూడా ఓ వింత చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ప్రతి నేరంలోనూ ఎక్కడో ఒక చోట సాక్ష్యాలు తప్పక ఉంటాయి.. అనేది ఎంత నిజమో అనేక అనుభవాలు, సందర్బాల్లో చూస్తూనే ఉంటాం. అందుకే దొంగలు కూడా తెలివిమీరి ప్రవర్తిస్తుంటారు. ఎలాంటి సాక్ష్యాలను వదిలివేయకుండా చాలా జాగ్రత్తగా ప్రయత్నిస్తారు. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో కూడా అలాంటిదే జరిగింది. చేతులకు ముందుజాగ్రత్తగా  గ్లౌజులు ధరించిన దొంగలు సిసిటివిని చూస్తున్నారు. ఇది సోషల్ మీడియా వినియోగదారులను కడుపుబ్బ నవ్వుకునేలా చేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దొంగలు ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి ప్రతి క్షణాన్ని స్పష్టంగా గమనిస్తున్నాడు ఆ ఇంటి యజమాని. అది కూడా అతను దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో కూర్చుని తన ఇంట్లోకి ప్రవేశించిన దొంగల కదలికను తన మొబైల్‌లో చూస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ కొట్టార్‌కు చెందిన సలీం విదేశాల్లో ఉంటున్నాడు. అయితే, సలీం ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే సలీం మొబైల్‌కు సమాచారం అందింది. ఇంట్లోని సీసీటీవీలో చూడగా.. ఇద్దరు వ్యక్తులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశిస్తున్నారు. అతని చేతులకు గ్లౌజులు కూడా ఉన్నాయి. కానీ, ముఖం కప్పుకోలేదు. ఈ క్రమంలో బయట ఉన్న సీసీటీవీని ధ్వంసం చేశారు. అయితే లోపల సీసీటీవీలు కూడా అమర్చారు. ఈ విషయాన్ని వారు గమనించుకోలేదు.

ఇదంతా దుబాయ్‌లో ఉన్న సలీం తన మొబైల్‌లో ఈ మొత్తం సినిమాను చూస్తూనే ఉన్నాడు. ఇంట్లోని ప్రతి వస్తువును దొంగలు తీయడం ప్రారంభించడంతో సలీం ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇంటి ముందు అలారం మోగించడంతో దొంగలు ఒక్కసారిగా తాము ఇరుక్కుపోయామని గ్రహించారు. అనంతరం కిచెన్‌ గ్రిల్‌ పగులగొట్టి ఇద్దరూ గోడ దూకి పారిపోయారు. సలీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..