నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ నెట్‌వర్క్‌లు ప్రజల జీవితాలతో పెనవేసుకున్నాయి. ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచం. ఇక్కడ మనం చాలా విభిన్న విషయాలను నేర్చుకుంటాము. ఇక్కడ షేర్ చేయబడిన విషయాలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. కొన్ని వీడియోలు సందేశాత్మకమైనవి, కొన్ని ప్రమాదకరమైనవి, చాలా వీడియోలు వినోదాత్మకంగా ఉంటాయి. మనం నమ్మలేని అనేక వీడియోలు సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంటాయి. వీటిని చూసి ఆశ్చర్యపోతాం. వీటిలో చాలా వరకు జంతువుల వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వింత వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి ఏం చేసాడో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.
ఇటీవల విడుదలైన ఈ వీడియోలో కనిపిస్తున్న ఒక వ్యక్తి అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. పైగా అతని చేతిలో మద్యం సీసా, మరో చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ఉన్నాడు. తాగి మత్తులో అతడు ఎలుగుబంటిపై ఎక్కి కూర్చుని ఉన్నాడు. తప్పతాగి ఏం చేస్తున్నాడో మర్చిపోయినట్టుగా ఉన్నాడు మనోడు.. ఏకంగా ఎలుగుబంటిపై సవారీ చేస్తున్నాడు. దాంతో ఆ ఎలుగుబంటి కోపంగా రంకేస్తున్నట్టుగా వీడియో ద్వారా మనకు అర్థం అవుతోంది. కానీ, ఏ మాత్రం బ్యాలెన్స్ అటుఇటు అయినా, అతడు ఆ ఎలుగుబంటికి ఆహారం అయిపోవాల్సిందే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
— that’s why women’s live longer than men (@TWWLLTM) March 11, 2023
ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 1.8 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. 44 వేల మందికి పైగా వినియోగదారులు వీడియోను లైక్ చేసారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే తాగి ప్రాణం పోయే ఆటలు ఎందుకురా బాబు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..