Viral News: ఎవరినైనా ఆటపట్టించడం అంటే మనకెంతో ఇష్టం.. అదే మనతో చనువుగా ఉండేవాళ్లని ఆట పట్టించడం మరింత సరదా.. అయితే ఆటపట్టించినా.. చివరికి వారు కష్టపడుతున్నారంటే.. ఆకష్టాన్ని చూసి మనం కూడా బాధపడతాం.. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెంపుడు జంతువులతో సరదాగా గడపడానికి అంతా ఇష్టపడతారు. ఒక్కోసారి తమ పెంపుడు జంతువులను ఆటపట్టించేందుకు వాటికి కొన్ని ఛాలెంజ్ లు విసురుతారు. ఇందులో భాగంగా తమ యజమానులు పెట్టిన ఛాలెంజ్ కు పెంపుడు పిల్లులు ఎలా స్పందించాయో అందరికీ అద్భుతంగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మియా, జెర్రీ అనే రెండు పిల్లులు తమ పెంపుడు తల్లిదండ్రులు పెట్టిన అడ్డంకిని ఎలా దాటాయో చూపిస్తోంది. నాలుగు రెట్ల ఎత్తును దాటేందుకు తనలో జంపింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది తెల్ల పిల్లి మియా, ఒక్కోసారి ఎగరడం ద్వారా, మరోసారి కింది నుంచి అవతలికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ.. చివరికి ఎలా దాటాలో తెలియక మియా మియా అంటూ అరుస్తుంటే.. సహాయం చేయమని అడుగుతున్నట్లు భావించిన యజమాని.. పిల్లి అవతలికి వచ్చేందుకు ఓ అవకాశమిస్తూ.. అడ్డుపెట్టిన కవర్ లో కొంతభాగాన్ని కట్ చేస్తూ.. వెసులుబాటు కల్పిస్తుంది. దీనిని గమనించి ఆపిల్లి ఆరంధ్రంలోంచి బయటకు వచ్చేస్తుంది. అయితే నల్లపిల్లి జెర్రీ మాత్రం ఆరంధ్రంలోంచి అవతలివైపుకు ఈజీగా వెళ్లిపోయింది. కాని బయటకు రావడానికి దారిలేక అరుస్తూ ఉండింపోయింది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. మియా ఎంతో తెలివైనదంటుంటే.. జెర్రీకి మెదడు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈవీడియోను ఇప్పటివరకు 3లక్షల మంది వీక్షించగా.. వేలాదిమంది లైక్ లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియోతో పాటు ఓ క్యాప్షన్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. మియా ఒక రాణి.. మరి జెర్రీ అంటూ క్యాప్షన్ పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..