రైల్వే స్టేషన్ లో నీటి కుళాయిలు ఉన్నప్పటికి.. వాటిలో కొన్ని మరమ్మతులకు గురవుతూ ఉంటాయి. కొన్ని కుళాయిలు పనిచేసినా, మరికొన్ని పనిచేయవు. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో కూడా కొన్ని సార్లు కుళాయిలు పాడవుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో కుళాయిలు పాడవడంతో నీరు వృద్ధా అవుతూ ఉంటుంది. కాని పశ్చిమబెంగాల్ లోని ఓ రైల్వే స్టేషన్ లో కుళాయి పాడవడంతో వాటర్ ప్రెషర్ కారణంగా రైల్లో వెళ్తున్న ప్రయాణీకుపై నీరు చిమ్మి వారంతా తడిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ లోని ఒక రైల్వే స్టేషన్ లో ఒక ట్యాప్ పాడయింది. దాని నుంచి వచ్చే నీరు.. షవర్ లా అందరినీ తడిపేసింది. ప్లాట్ ఫామ్ పై వెళ్తున్న రైలు, రైల్లోని ప్రయాణికులను కూడా తడిపేసింది. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్ అవుతోంది.
ఈ వీడియోని ‘ ఇండియన్ రైల్వే ఎట్ యువర్ సర్వీస్’ అనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో ఓ వ్యక్తి పోస్టు చేశారు. షేర్ చేసిన అప్పటినుంచి ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా, వేలాది లైక్ లు వచ్చాయి. ఈ వీడియో 30 సెకన్లు ఉండగా.. ఫుటేజీలో, పగిలిన కుళాయి నుండి నీరు ఫిరంగిలాగా పూర్తి శక్తితో బయటకు రావడం కనపడుతోంది. కొద్దిసేపటి తర్వాత, కెమెరా ఇన్‌కమింగ్ రైలు వైపు ప్యాన్ చేయడంతో, ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఉన్న ప్రయాణికులు తడిసిపోయారు. నీళ్లు మీద పడగానే వెంటనే లోపలికి పరిగెత్తిన వారు కూడా ఉన్నారు.
Indian railways at your service ? pic.twitter.com/fEL65NFjHs
— Abhy (@craziestlazy) October 26, 2022
ఈ వీడియో వైరల్ గా మారడంతో పాటు కామెంట్ల వర్షం కురుస్తోంది. కుళాయికి కోపం వచ్చిందని, ఆ కోపం నుంచి ప్రయాణికులు కూడా తప్పించుకోలేకపోయారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. ఇది రైల్వే అందించిన స్పెషల్ సేవ అని కామెంట్ చేశారు. ప్రయాణికులు చాలా మంది ఉదయాన్నే స్నానం చేయరని.. ఇలా ప్లాన్ చేశారంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తం మీద కుళాయి పగలడంతో ప్రయాణీకులందరికి ఉచిత స్నానం అయిందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..