ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ ఇది.. గిన్నిస్ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.. ప్రత్యేకత తెలిస్తే అవాక్కే..!

|

Mar 23, 2024 | 6:29 PM

బియ్యం పిండితో చేసిన దోసలో.. మసాలా దోస, ఉల్లిపాయ దోస, సాదా దోస, మైసూర్ దోస, రవ్వ దోస, ఎగ్‌ దోస, పన్నీర్‌ దోస వంటి వివిధ రకాల్లో దోసెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందరికీ ఇష్టమైన దోసెల తయారీలో పలు ప్రయోగాలు చేస్తుంటారు ప్రజలు. అలాంటిదే ఇక్కడ కొందరు చెఫ్‌ల బృందం కలిసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసెను తయారు చేశారు.

ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ ఇది.. గిన్నిస్ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.. ప్రత్యేకత తెలిస్తే అవాక్కే..!
Long Dosa
Follow us on

దోస అనేది దక్షిణ భారతదేశంలోని ప్రత్యేకమైన అల్ఫాహారం. ఈ దోసె అందరికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌. దోసెలో చాలా వెరైటీలు ఉన్నాయి. కాబట్టి ఈ దోసెను ఇష్టపడని వారు ఉండరు. దోస దాని స్ఫుటమైన రుచి, పోషకాల కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ అల్పాహార ఎంపికలలో ఒకటి. దీనిని సాంబార్, కొబ్బరి చట్నీతో వేడి వేడిగా తింటే ఆహా.. స్వర్గం అంచులదాకా వెళ్లినట్టుగా ఉంటుంది భోజన ప్రియులకు. బియ్యం పిండితో చేసిన దోసలో.. మసాలా దోస, ఉల్లిపాయ దోస, సాదా దోస, మైసూర్ దోస, రవ్వ దోస, ఎగ్‌ దోస, పన్నీర్‌ దోస వంటి వివిధ రకాల్లో దోసెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందరికీ ఇష్టమైన దోసెల తయారీలో పలు ప్రయోగాలు చేస్తుంటారు ప్రజలు. అలాంటిదే ఇక్కడ కొందరు చెఫ్‌ల బృందం కలిసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసెను తయారు చేశారు.

సోషల్ మీడియాలో రెగ్గీ మాథ్యూ (@chefregimathew) అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన స్పెషల్ దోసె అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ 75 మంది చెఫ్‌ల బృందం కలిసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసెను తయారు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. MTR ఫుడ్స్, వారి 100వ వార్షికోత్సవం సందర్భంగా 123.03 అడుగుల పొడవైన దోసను లోర్మాన్ కిచెన్ ఎక్విప్‌మెంట్‌తో తయారు చేసి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. చెఫ్ రెగీ మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం మార్చి 15న బెంగళూరులోని ఎంటీఆర్ ఫ్యాక్టరీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఇవి కూడా చదవండి

చెఫ్ రెగీ మాథ్యూస్ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక వీడియోతో ప్రకటనను షేర్‌ చేశారు. క్యాప్షన్‌లో MTR వారు ఒక చారిత్రాత్మక మైలురాయిని దాటిన క్రమంలో నేను సంతోషిస్తున్నాను! అంటూ వీడియోని షేర్‌ చేశారు. ఇక్కడ నమ్మశక్యం కానీ, విషయం ఏంటంటే.. 123.03 అడుగుల పొడవైన దోసెను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌లను సాధించారు. దాంతో పాటుగానే 100వ వార్షికోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాను! టైటిల్ రాశారు. అయితే, నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోస కోసం మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్ 16.68 మీ (54 అడుగులు).

ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోసెగా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అతను పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, చాలా మంది వినియోగదారులు కామెంట్‌లు ఇవ్వడం ద్వారా తమ కోరికలను వ్యక్తం చేశారు. ప్రపంచ రికార్డును గెలుచుకున్నందుకు చాలా మంది వినియోగదారులు చెఫ్, అతని బృందానికి అభినందనలు తెలియజేస్తూ తమ స్పందన తెలియజేశారు. అద్భుతం. అభినందనీయం అంటూ వారిని అని కొనియాడుతున్నారు. MTR ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 24,000పైగా వీక్షణలు, దాదాపు 1,000పైగా లైక్‌లను పొందింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..