ఇదేం కర్మరా సామీ..! ఆన్‌లైన్‌లో అమ్మకానికి 85ఏళ్లనాటి చిరిగిన చొక్కా.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

|

Jan 03, 2025 | 7:13 PM

వైరల్‌ పోస్ట్‌లో ఓ వ్యక్తి తన వద్ద 1940ల కాలం నాటి కోటు ఒకటి ఉందని పేర్కొంటూ దానిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది నిజమైతే, ఈ షర్ట్‌ వయస్సు సుమారు 85 సంవత్సరాలు. అయితే, ఈ మాసిపోయిన, మురికి, చిరిగిన చొక్కా ధర తెలిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! అవును నిజంగానే ఈ చొక్కా లక్షల్లో ఉంది..వైరల్‌ పోస్ట్‌ ద్వారా ఈ చొక్కాను విక్రయిస్తున్న వ్యక్తి దాని ధరను

ఇదేం కర్మరా సామీ..! ఆన్‌లైన్‌లో అమ్మకానికి 85ఏళ్లనాటి చిరిగిన చొక్కా.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
Sweatshirt From 1940s
Follow us on

నేటి ఫ్యాషన్ ప్రపంచంలో వెలువడే కొత్త పోకడలు ఆశ్చర్యకరంగా, ఆసక్తిగా ఉంటున్నాయి.. అలాంటి లుక్స్ మనకు వింతగా అనిపించవచ్చు. కానీ, ఒక్కోసారి అలాంటి ఫ్యాషన్స్‌లో కొన్ని చాలా అరుదైనవి, ఖరీదైనవి కూడా ఉంటున్నాయి. ఒక్కోసారి చిరిగిన బట్టలు ధరించడం కూడా కొత్త ట్రెండ్ అంటున్నారు కొందరు ఫ్యాషన్‌ ప్రియులు. అవును, ఇప్పుడు అలాంటిదే ఓ వింతపోస్ట్‌ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దశాబ్దాల నాటి మురికి, చిరిగిన చొక్కాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ వీడియోలో ఓ వ్యక్తి వీడియో.

వైరల్‌ పోస్ట్‌లో ఓ వ్యక్తి తన వద్ద 1940ల కాలం నాటి కోటు ఒకటి ఉందని పేర్కొంటూ దానిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది నిజమైతే, ఈ షర్ట్‌ వయస్సు సుమారు 85 సంవత్సరాలు. అయితే, ఈ మాసిపోయిన, మురికి, చిరిగిన చొక్కా ధర తెలిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! అవును నిజంగానే ఈ చొక్కా లక్షల్లో ఉంది..వైరల్‌ పోస్ట్‌ ద్వారా ఈ చొక్కాను విక్రయిస్తున్న వ్యక్తి దాని ధరను $2,500 అంటే రూ. 2.14 లక్షలుగా చెబుతున్నాడు. ‘బిడ్‌స్టిచ్’ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఈ వింత విక్రయ దృశ్యాలను చూపుతుంది. దాన్ని ‘క్లాసిక్ షర్ట్’ అని చెప్పి అమ్మే ప్రయత్నం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 82 లక్షల మంది వీక్షించారు. అలాగే చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. పేదరికం ఫ్యాషన్‌గా మారిపోయిందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఈ షర్ట్‌ స్మశాన వాటిక నుండి దొంగిలించబడి ఉంటుందని ఒకరు వ్యాఖ్యనించగా,ఈ చొక్కా అమ్మడం ద్వారా ఈ వ్యక్తి ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎగతాళి చేస్తుందని మరి కొందరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..