పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. చూశారంటే మీ పొట్ట చెక్కలే..

పెళ్లిలో వధువు రసగుల్లాను పట్టుకున్న వైరల్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బంధువులు స్వీట్ తినిపించే సమయంలో జారి పడుతున్న రసగుల్లాను వధువు మెరుపు వేగంతో అందుకుంది. ఆమె క్యాచ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫన్నీ మూమెంట్‌ను నెటిజన్లు ఎంఎస్ ధోనీ క్యాచ్‌తో పోలుస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియో అందరినీ నవ్విస్తోంది.

పెళ్లిలో రస్‌గుల్లా ఆట..! భలే క్యాచ్‌పట్టిన వధువు.. చూశారంటే మీ పొట్ట చెక్కలే..
Rasgulla Catch By Bride

Updated on: Jan 24, 2026 | 2:23 PM

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించి చాలా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో వధూవరులకు సంబంధించి, బంధుమిత్రులు చేసే అల్లరి చేష్టలు తరచూగా మానం చూస్తూనే ఉంటాం.. అయితే, ఒక్కోసారి వధువు, లేదంటే వరుడు చేసే వింత వింత పనులు కూడా నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. ఇది కూడా అలాంటిదే.. ఇక్కడ వధువు చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వావ్‌ ఏం క్యాచ్‌ అది అంటూ ఆమెను సరదా ప్రశంసలతో ముంచేస్తున్నారు.

సాదారణంగా పెళ్లిలో వధువు సిగ్గుపడటం చూస్తుంటాం. కానీ, మీరెప్పుడైనా కరెక్ట్‌ క్యాచ్‌ పట్టుకున్న పెళ్లి కూతురిని చూశారా..? పెళ్లి కూతురు ఏంటీ..? క్యాచ్‌ పట్టడం ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఒక పెళ్లిలో ఒక వధువు రసగుల్లాను పట్టుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం. వధువు క్యాచ్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

వివాహ ఆచారాలలో స్వీట్లు తినడం ఒక సాధారణ విషయమే. అయితే, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో బంధువులు వధూవరులకు రస్‌గుల్లా తినిపిస్తున్నారు. ఇప్పుడు వరుడి వంతు వచ్చింది. కానీ, మిఠాయి తినిపిస్తున్న మహిళ చేతిలోంచి ఆ రస్‌గుల్లా జారి కిందపడింది..కానీ, పక్కనే ఉన్న వధువు.. మెరుపు వేగంతో దాన్ని చేజారకుండా పట్టేసుకుంది..జ్యూసీగా చూస్తేనే నోరూరిపోయేలా కనిపిస్తున్న రస్‌గుల్ల కిందపడిందేమోనని ఆ మహిళ కంగారుగా చూసే సరికి అది పెళ్లి కూతురి చేతిలో పడటం కనిపిస్తుంది. ఆమె క్యాచ్‌ని భలేగా పట్టింది..దాంతో ఈ వివాహ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. అందుకే అందరూ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తున్నారు. కొన్ని సెకన్లు మాత్రమే నిడివి కలిగిన ఈ వీడియోని చాలా మంది నెటిజన్లు వధువు క్యాచ్‌ను క్రికెటర్లతో, ముఖ్యంగా ఎంఎస్ ధోని క్యాచింగ్ శైలితో పోలుస్తున్నారు. ఈ వీడియోకు రకరకాల ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..