Viral Video: టేకాఫ్‌ సమయంలో విమానంలో మంటలు… ఒక్కొక్క ప్రయాణికుడిని ఎలా తరలించారో చూడండి

అమెరికాలో విమాన ప్రయాణికులకు పెను ప్రామదం తప్పింది. ఓర్లాండో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన అధికారులు సకాలంలో స్పందించారు. విమానంలోని ప్రయాణికులను అత్యవసర స్లైడ్‌ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 294 మంది ఉన్నట్లు...

Viral Video: టేకాఫ్‌ సమయంలో విమానంలో మంటలు... ఒక్కొక్క ప్రయాణికుడిని ఎలా తరలించారో చూడండి
Delta Plane Fire

Updated on: Apr 22, 2025 | 5:03 PM

అమెరికాలో విమాన ప్రయాణికులకు పెను ప్రామదం తప్పింది. ఓర్లాండో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన అధికారులు సకాలంలో స్పందించారు. విమానంలోని ప్రయాణికులను అత్యవసర స్లైడ్‌ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 294 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ 1213, సోమవారం ఉదయం 11:15 గంటల సమయంలో ఓర్లాండో ఎయిర్‌పోర్ట్‌ నుంచి హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లతో విమానం టేకాఫ్‌ కోసం రన్‌వేపై సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్‌ అవుతుంది అనగా విమానం ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ స్లైడ్స్‌ నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకుండా అంతా సురక్షితంగా బయటకొచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

తమ ప్రయాణీకులు తమకు ఎంతగానో సహకరించారని.. ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నామని ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెప్పారు. అంతేకాదు ప్రయాణీకులకు ఎదురైన ఈ అనుభవానికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. ప్రయాణీకుల భద్రత కంటే తమకు మరేమీ ముఖ్యం కాదని.. డెల్టా బృందాలు మా కస్టమర్లను వీలైనంత త్వరగా వారి తుది గమ్యస్థానానికి చేరుస్తాయని ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. మంటల్లో చిక్కుకున్న విమానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

వీడియో చూడండి: