Viral Video: అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఆస్తి కోసమే అమానుష ప్రవర్తన

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కొడలు ఆస్తి కోసం అత్త, ఆడబిడ్డలను చిత్రహింసలు పెడుతూ ఇంటినుంచి గెంటేసింది. ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వీడియో వైరల్ అవుతుంది.

Viral Video: అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఆస్తి కోసమే అమానుష ప్రవర్తన
Viral Video

Updated on: May 20, 2022 | 10:57 AM

Viral Video: కొత్తగా పెళ్లి చేసుకొని, అత్త గారింట అడగుపెట్టిన కోడలికి అక్కడి పరిస్థితులు, వాతావరణం కాస్త భిన్నంగా ఉంటాయి. అమ్మాయిలకు తన అత్తారింట్లోని పద్దతులను అలవాటు చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. అలాగే కొత్త కోడలిని తమలో కలుపుకోడానికి ఆ కుటుంబ సభ్యులకూ కొంత టైం పడుతుంది. ఈ క్రమంలో చిన్న చిన్న వివాదాలు రావడం సర్వసాధారణం. వీటిని కొందరు నెమ్మదిగా శాంతంగా పరిష్కారం చేసుకుంటారు. మరికొందరు పెద్ద రచ్చ చేస్తారు. పంచాయితీలు పెట్టుకుంటూ నానా హంగామా చేస్తుంటారు. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వైరల్(Viral Video) అవుతున్న వీడియో కూడా అలాంటిదే.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కొడలు ఆస్తి కోసం అత్త, ఆడబిడ్డలను చిత్రహింసలు పెడుతూ ఇంటినుంచి గెంటేసింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్‌కు చెందిన ఓ వృద్ధ మహిళ ఎంతో సంబరంగా తన కొడుక్కి పెళ్లి చేసింది. కొడుకు, కోడలుతో  పుట్టబోయే మనవలతో ఎంతో సంతోషంగా తన శేష జీవితం గడపాలనుకుంది. కానీ ఆమె ఆశలన్నీ అడియాలసయ్యాయి. వచ్చిన కొత్త కోడలు కొన్ని రోజులకే అత్తను ఇంటినుంచి వెళ్లగొట్టింది. దీంతో ఆ మహిళ దిక్కు తోచక తన కూతురు ఇంటికి చేరింది. కాగా, ఇటీవల ఆమె తన కూతురు, అల్లుడితో కలిసి తన ఇంటికి వచ్చింది. దీంతో కోడలు రెచ్చిపోయింది. అత్తపై దాడికి దిగింది. జుట్టుపట్టుకుని బయటకు తోసేసింది. అడ్డుకున్న ఆడబిడ్డపై కూడా అమానుషంగా ప్రవర్తించింది. ఇద్దరిని జుట్టుపట్టుకుని లాగి కోడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. కాగా, ఆస్తి వివాదం వలనే కోడలు ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..