Viral Video: రోబో దగ్గర బ్యాగ్‌ను చోరీ చేసిన మహిళ… తరువాత ఏమి జరిగిందో చూస్తే మీరు షాక్ అవుతారు!

సోషల్‌ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్‌ వైరల్‌ అవుతూ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. ఒక మహిళ AI రోబోట్‌ను దోచుకుంటున్నట్లు చూపించే హాస్యాస్పదమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పట్ల నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. వైరల్ క్లిప్‌లో, ఆ మహిళ AI-ఆధారిత రోబోట్ నుంచి బ్యాగ్‌ను

Viral Video: రోబో దగ్గర బ్యాగ్‌ను చోరీ చేసిన మహిళ... తరువాత ఏమి జరిగిందో చూస్తే మీరు షాక్ అవుతారు!
Woman Steels Ai Robot Bag

Updated on: Mar 18, 2025 | 5:41 PM

సోషల్‌ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్‌ వైరల్‌ అవుతూ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. ఒక మహిళ AI రోబోట్‌ను దోచుకుంటున్నట్లు చూపించే హాస్యాస్పదమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పట్ల నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. వైరల్ క్లిప్‌లో, ఆ మహిళ AI-ఆధారిత రోబోట్ నుంచి బ్యాగ్‌ను దొంగిలిస్తున్నట్లు చూడవచ్చు. ఎరుపు రంగు బ్యాగ్‌ను పట్టుకున్న రోబోట్ వెనుకకు మహిళ నిశ్శబ్దంగా వెళ్లి ఆ బ్యాగ్‌ను దొంగిలించడం ఫుటేజ్‌లో కనిపిస్తుంది.

ఆశ్చర్యపోయిన రోబోట్ తన బ్యాగ్ కోసం చుట్టూ చూసింది. తన బ్యాగ్‌ ఎవరో తీసుకున్నారని గందరగోళంగా ఆ ప్రాంతాన్నంతా పరిశీలించింది. రోబోకు ఆ మహిళ మీదే అనుమానం వచ్చి ఆమె వైపు చూసింది. అయితే, ఈ వీడియో AIని ఉపయోగించి రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ వీడియోను రాండమ్ అడల్ట్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

దొంగతనం కొత్త ట్రెండ్ గా మారిందని ఒకరు పోస్టు పెడితే దొంగతనం కొత్త ఉద్యోగం అని నేను చెప్పాలా? అని మరొక నెటిజన్‌ కామెంట్ చేశాడు. నెటిజన్లలో ఒక వర్గం AI మానవులకు ప్రమాదకరం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియో చూడండి: