
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ముదిరిపోతోంది. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ పచ్చి అలవాటు అయిపోయంది. కొందరు నిత్యం ఇదే పనిలో ఉంటున్నారు. వ్యూస్, లైకుల కోసం రీల్స్ చేస్తూ సంబరపడుతున్నారు. ఇక కొందరు చేసే ఈ పిచ్చి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ గేదెపై నిలబడి చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ మహిళ ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు గేదెపై డాన్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట గెదెను కట్టేసి, దాని ముందు, వెనుక ఇద్దరు నిలబడి కదలకుండా పట్టుకున్నారు.
తర్వాత మహిళ గేదె పైకి ఎక్కి నిలబడింది. గెదెపై నిలబడి డాన్స్ చేస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఇలా ఆమె చాలా సేపు గేదెపై నిలబడి డాన్స్ చేస్తూనే ఉంది. కానీ ఈ క్రమంలో గేదె పరుగులు తీసి ఉంటే.. బాడీ వద్దలయ్యేది. ఆమె డాన్స్ చేస్తుంటే పక్కన ఉన్న వాళ్లు కూడా తెగ సంబరపడుతూ వాళ్లు కూడా కాస్తా డ్యాన్స్‌ను అందుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చివరకు నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పిచ్చి పీక్స్‌కు చేరిందని తిట్టిపోతున్నారు.
खुद को फेमस करने के चक्कर में किसी को कष्ट मत दो 🙂😢 pic.twitter.com/ulHaE0Ib7c
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 11, 2025
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి