ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం రెండు విషయాలు మాత్రమే ఎక్కువగా ప్రత్యేకమైనవి అని చెప్పాలి. మొదటిది పెళ్లికి సిద్ధమవ్వడం, రెండోది పెళ్లి భోజనం చేయటం. పెళ్లిళ్లలో రకరకాల వంటకాలు, స్వీట్లు వడ్డిస్తుంటారు. మీరు అన్ని రకాల ఆహారాన్ని రుచి చూడగలిగే ఏకైక ప్రదేశం ఇదే అని చెప్పాలి. ప్రతి వివాహ సీజన్‌లో మీరు ఏదో ఒక ఆకర్షణీయమైన వంటకాన్ని గమనిస్తూనే ఉంటారు. ఈ సారి మిర్చి హల్వా ట్రెండ్ అవుతోంది. ఏంటీ షాక్ అయ్యారా..? ఇది నిజమేనండోయ్ వివాహ విందులో మిరపకాయ హల్వాను వడ్డిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. అందులో మీరు మిరపకాయ హల్వాను చూడవచ్చు. సాధారణంగా పెళ్లిళ్లలో క్యారెట్ హల్వా, కేసర్ హల్వా, బాదాం హల్వా చూస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో స్వీట్‌ను ఒక స్పెషల్ వెర్షన్‌లో అందిస్తున్నారు. ఈ హల్వాలో మీకు పచ్చిమిర్చి కారంగా, స్వీట్ల తియ్యదనాన్ని అందిస్తున్నారు. పెద్ద మిరపకాయలతో చేసిన హల్వా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. తీపి, కారం రెండింటీ కలయికతో వెరైటీ రుచిని అందిస్తుంది. ఇది విచిత్రమైన మిశ్రమం అయినప్పటికీ, ఇది త్వరగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. కొంతమంది క్యాటరర్లు కూడా దీన్ని తమ మెనూలో చేర్చుకుంటారు. ఈ వంటకం వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వీడియోకి 10 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోపై చాలా ఫన్నీ కామెంట్స్ వచ్చాయి. ఈ వంటకాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోతే.. మరికొందరు ఇది స్వీట్‌గా ఉందా లేదా కారంగా ఉందా అని ప్రశ్నించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..