Viral Video: ఇప్పుడిప్పుడే ఫుట్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ.. ఈ కుర్రాడు కొట్టిన కార్నర్ గోల్‌కి ఫిదా..మనదేశపు ​​రొనాల్డో అంటూ ప్రశంసల వర్షం

|

Jun 10, 2022 | 7:44 PM

Viral Video: వైరల్ అవుతున్న ఈ వీడియో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళు గోల్‌కీపర్ చుట్టూ నిలబడి గోల్‌ను కాపాడుతుండగా.. ఆటగాడు కార్నర్ షాట్‌కు సిద్ధంగా ఉన్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు.

Viral Video: ఇప్పుడిప్పుడే ఫుట్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ.. ఈ కుర్రాడు కొట్టిన కార్నర్ గోల్‌కి ఫిదా..మనదేశపు ​​రొనాల్డో అంటూ ప్రశంసల వర్షం
Uttarakhand Ronaldo
Follow us on

Viral Video: దేశంలో క్రికెట్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇతర క్రీడల పట్ల కూడా ఆదరణ పెరుగుతుంది. తాజాగా ఫుట్‌బాల్ కి కూడా మెల్లగా ఆదరణ పెరుగుతుంది. యువ తరం కూడా ఫుట్ బాల్ క్రీడాకారుడిగా కెరీర్ ను ఎంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.  అయితే ప్రతి ఒక్క ఫుట్ బాల్ క్రీడాకారుడిలోనూ మెస్సీ లేదా రొనాల్డో వంటి వారి ప్రతిభ ఉండకపోవచ్చు. అయితే  ప్రస్తుతం ఉత్తరాఖండ్ కు చెందిన ఓ యువకుడు తన అద్భుతమైన ఫుట్ బాల్ టాలెంట్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఈ యువకుడినిక్రీడాభిమానులు క్రిస్టియానో ​​రొనాల్డోతో పోల్చడం ప్రారంభించారు. ఈ కుర్రాడు కార్నర్ నుండి ఓ అద్భుతమైన గోల్ చేసాడు. ఈ గోల్ ని చూస్తే.. ఆటలంటే ఇష్టమున్న ఎవరైనా ఈ కుర్రాడికి అభిమానిగా మారిపోతారు మరి.

వైరల్ అవుతున్న ఈ వీడియో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళు గోల్‌కీపర్ చుట్టూ నిలబడి గోల్‌ను కాపాడుతుండగా.. ఆటగాడు కార్నర్ షాట్‌కు సిద్ధంగా ఉన్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. మూలలో నుండి ఆటగాడు ఓ షాట్‌ను కొట్టాడు.. ఆ షాట్ ను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఫుట్‌బాల్ గాలిలో తేలుతూ.. ఎవరూ ఊహించని విధంగా గోల్ పోస్టులోకి వెళ్ళింది. అది చూసి గోల్‌కీపర్ కూడా ఒక్కక్షణం నిశ్చేష్టులయ్యాడు. అవును ఆ కుర్రాడు కొట్టిన కార్నర్ షాట్..తో ఫుట్ బాల తన లక్ష్యంలోకి ప్రవేశించి గోల్ అయింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి:

ఈ బాలుడు అద్భుతమైన గోల్స్ చేస్తున్న వీడియో ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో ఆ కుర్రాడి గురించి సమాచారం ఇస్తూ.. ఈ వీడియోలో కనిపిస్తున్న బాలుడు పేరు హేమ్‌రాజ్ జోహారీ అని పేర్కొన్నారు. ఇతను ఉత్తరాఖండ్‌కు చెందిన రొనాల్డోగా అభివర్ణించారు. మారుమూల గ్రామానికి చెందిన మున్సియరీకి చెందిన హేమ్‌రాజ్ జోహారీ ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్ అని .. ఇతని తండ్రి టైలరింగ్‌ పని చేస్తుంటాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా హేమ్‌రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..