Amreica Man: అర్ధరాత్రి దారి తప్పిన వ్యక్తి.. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ప్రాణాలకు తెగించి కాపాడిన సాహసి

|

Nov 01, 2022 | 12:07 PM

మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్మోక్‌ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని,

Amreica Man: అర్ధరాత్రి దారి తప్పిన వ్యక్తి.. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ప్రాణాలకు తెగించి కాపాడిన సాహసి
Us Man Saves Four Siblings
Follow us on

బ్రెండన్‌ బ్రిట్‌ అనే వ్యక్తి కారులో వెళ్తూ దారి తెలియక మరో మార్గంలోకి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి కావడంతో అతను వెళ్లాల్సిన దారి మిస్‌ అయ్యాడు. అయితే పెద్దలు అంటూ ఉంటారు ఏది జరిగినా అంతా మన మంచికే అని. అది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఎందుకంటే అతను దారితప్పడం వల్ల నాలుగు నిండుప్రాణాలు బ్రతికి బయటపడ్డాయి. అవును. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని మంటలు ఎగసిపడుతున్న ఇంట్లోకి వెళ్లి నలుగురిని కాపాడాడు బ్రిట్‌. ఈ ఘటన అక్టోబరు 23న అమెరికాలోని అయోవా ప్రాంతంలో జరిగింది.

బ్రిట్‌ కారులో వెళ్తుండగా ఓ ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి కిటికీలను పగలగొట్టి లోపల ఎవరైనా ఉన్నారేమో పరీక్షించినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారని అనిపించిందని, వెంటనే వారిని కాపాడాలనిపించినట్లు బ్రిట్‌ చెప్పాడు. మంటలు తీవ్రమవుతున్న క్రమంలో లోపలి ఉన్న వారిని అలర్ట్‌ చేసి ఇంటి గుమ్మం ద్వారా బయటకు పంపించినట్లు తెలిపారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని డోర్‌బెల్‌ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు ఇంటి యజమాని, నలుగురు పిల్లల తల్లి టెండర్‌ లెమన్‌. మన జీవితాలు శాశ్వతంగా మారిన రోజు! కానీ, బూడిద నుంచే కదా?? అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 

మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్మోక్‌ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని, బయట నుంచి అరుపులు విని లేచినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఇంటి యజమాని లెమన్‌. ఈ మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఐదు పెంపుడు శునకాలు మృతి చెందాయని, మరో రెండు గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. అయితే, ఇంట్లో మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు రెడ్‌ ఓక్‌ ఫైర్‌ విభాగం తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..