అరె.. ఇలాంటివి కూడా దొంగతనం చేస్తారా అనక మానరు ఈ న్యూస్ చదివితే. అలాంటి వింత చోరీ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో వెలుగుచూసింది. డబ్బు, ఆభరణాలు, విలువైన వస్తువులు, మోటార్ సైకిల్స్, కార్లు దొంగతనం చేయడం మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు పూల మొక్కలు చోరీ చేశారు. అది కూడా కారులో వచ్చి మరీ. అయితే ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో వీరి చోర కళ రికార్డవ్వడంతో అడ్డంగా బుక్కయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌ను గమనిస్తే , ఇద్దరు అమ్మాయిలు సెడాన్ కారులో వచ్చారు. ఆ తర్వాత చుట్టూ అంతా వెతికి.. తమను ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత చప్పిడి కాకుండా వచ్చి ఇంటి మెయిన్ గేటు దగ్గర ఉంచిన రెండు పూల మొక్కలను కుండీలతో సహా ఎత్తుకెళ్లారు. ఈ వింత చోరీ ఘటన మొహాలీలోని సెక్టార్ 78లో జరిగింది.
Women found stealing flowerpots outside a home in Mohali, Punjab.pic.twitter.com/XGuXad4g8w
— The Purusharth 🌟 (@thepurusharth) November 14, 2023
పూల కుండీలు చోరీకి అవ్వడం, అది కూడా సెడాన్ కారులో వచ్చిన అమ్మాయిలు వాటిని దొంగిలించడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అయితే, ఇంటి ముందు సీసీ కెమెరాలు గమనించని ఈ అమ్మాయిలు అడ్డంగా బుక్కయ్యారు. ‘అరెరె భలే బుక్కయ్యారు’.. ‘బొత్తిగా మీకు ఎక్స్‌పీరియన్స్ లేదనుకుంట’.. ‘సీసీ కెమెరాలు చూసుకోవాలి కదమ్మా’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వింత చోరీ ఘటనలు వెలుగుచూశాయి. పూల కుండీలు మాత్రమే కాదు.. ఇంటి ముందు గేట్లు కూడా ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కార్లలో వచ్చి ఇలా చోరీలకు పాల్పడటం మాత్రమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..