Viral Video: పెద్ద పులి, ఎలుగుబంటి ముఖాముఖి.. జంగిల్ బుక్‌లో దృశ్యం అంటూ నెట్టింట్లో వీడియో వైరల్

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో ఎన్ని రకాల వీడియోలు రోజూ చక్కర్లు కొట్టినా వాటిల్లో ఎక్కువుగా ఆకర్షించేవి జంవుతులకు సంబంధించిన వీడియోలు అని చెప్పడం అతిశయోక్తి కాదు. కుక్క, పిల్లి, ఏనుగుల వీడియోలే..

Viral Video: పెద్ద పులి, ఎలుగుబంటి ముఖాముఖి.. జంగిల్ బుక్‌లో దృశ్యం అంటూ నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video

Updated on: Mar 10, 2022 | 3:11 PM

Viral Video: సోషల్ మీడియా(Social Media)లో ఎన్ని రకాల వీడియోలు రోజూ చక్కర్లు కొట్టినా వాటిల్లో ఎక్కువుగా ఆకర్షించేవి జంవుతులకు సంబంధించిన వీడియోలు అని చెప్పడం అతిశయోక్తి కాదు. కుక్క, పిల్లి, ఏనుగుల వీడియోలే కాదు.. కౄరజంవుతులైన పులి, సింహం, ఎలుగుబంటి వంటి జంతువుల వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక కార్టూన్స్ లో పిల్లలు జంతువులకు సంబంధించినవి ఎక్కువగా చూస్తుంటారు.  ది జంగిల్ బుక్‌(The jungle book) లో మోగ్లీ ఇప్పటికీ చిన్నారులకు అంత ఇష్టమైన కార్టూన్ షోగా నిలబడానికి కారణం.. అందులో మోగ్లీకి ఎలుగుబంటికి ఉన్న స్నేహమే అని చెప్పవచ్చు..  ది జంగిల్ బుక్‌ లో క్రూరమైన పులి షేర్ ఖాన్ నుండి మోగ్లీని అతని ప్రియమైన స్నేహితుడు బాలూ ఎలుగుబంటి రక్షించిన దృశ్యం పిల్లలకు ఇష్టమైంది. అదే అటువంటి దృశ్యం రియల్ గా దర్శనమిస్తే.. ఎలా ఉంటుంది. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

IFS అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ క్లిప్ మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్‌లో చిత్రీకరించబడింది . నిజానికి నమన్ అగర్వాల్ చిత్రీకరించిన వీడియో..లో అడవిలో ఒక మార్గం మధ్యలో ఒక పులి కూర్చున్నట్లు ఉంది. ఆ మార్గంలో పులికి ఎదురుగునా ఒక పెద్ద నల్ల ఎలుగుబంటి  నడుచుకుంటూ వస్తుంది.  పులిని చూసి.. ఎలుగుబంటి  భయపెట్టడానికి ప్రయత్నిస్తూ.. తన రెండు కాళ్ళమీద నిలబడింది. పెద్ద పులి ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు  చూపిస్తూ.. వీడియో ఎండ్ అయ్యింది.

ఈ వీడియో క్లిప్ 31k  వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సన్నివేశాన్ని జంగిల్ బుక్‌లోని చాప్టర్‌గా పేర్కొంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

 ఈ నలుగురితో నిజాయతీగా స్నేహం చేస్తే.. జీవితాంతం అన్నివిధాలా మీకు తోడుగా ఉంటారంటున్న చాణక్య