Viral Video: అనుకోని అతిథి…ఇంట్లోకి దూరి మంచంపై రెస్ట్‌ తీసుకున్న బెబ్బులి… అంతకంటే ముందు ఏం చేసిందో తెలుసా?

పెద్దపులి అంటే సాటి జంతువులకే కాదు మనుషులకు కూడా హడలే. అది కనిపిస్తే కాదు..గాండ్రింపు విన్నా గుండెల్లో దడ పుట్టాల్సిందే. అలాంటిది ఓ పులి ఏకంగా ఇంట్లోకి దూరింది. ఏంచక్కా మంచం మీద కూర్చుని రెస్ట్‌ తీసుకుంది. ఆ సమయంలో అది ఓ రేంజ్‌లో దర్జా...

Viral Video: అనుకోని అతిథి...ఇంట్లోకి దూరి మంచంపై రెస్ట్‌ తీసుకున్న బెబ్బులి... అంతకంటే ముందు ఏం చేసిందో తెలుసా?
Tiger Sittin On Cot

Updated on: Dec 30, 2025 | 4:28 PM

పెద్దపులి అంటే సాటి జంతువులకే కాదు మనుషులకు కూడా హడలే. అది కనిపిస్తే కాదు..గాండ్రింపు విన్నా గుండెల్లో దడ పుట్టాల్సిందే. అలాంటిది ఓ పులి ఏకంగా ఇంట్లోకి దూరింది. ఏంచక్కా మంచం మీద కూర్చుని రెస్ట్‌ తీసుకుంది. ఆ సమయంలో అది ఓ రేంజ్‌లో దర్జా ప్రదర్శించింది. అయితే అంతకంటే ముందు ఓ వ్యక్తి మీద పంచ్‌ విసిరింది. ఆ తర్వాత ఏం ఎరుగనట్లు మంచం మీద కూర్చుని సేద తీరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

ఆ పులి చేసిన హల్‌చల్‌ మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఏ పులి ఇలా చేసి ఉండదు. బంధవ్‌గఢ్‌ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో నుంచి ఓ పులి సమీపంలోని గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచంపై కూర్చున్న గోపాల్‌ కోల్‌ అనే వ్యక్తికి చాచి ఓ పంచ్‌ ఇచ్చింది. ఆ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోవడంతో ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న దుర్గాప్రసాద్‌ ద్వివేది అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చుని దర్జా ఒలకబోసింది. పులిని చూసిన స్థానికులు ఒక్కసారిగా వణికిపోయారు. ఇంటి పైకప్పులు ఎక్కి గప్‌చుప్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని చర్యలు చేపట్టారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. దీంతో స్థానికులు బతుకు జీవుడా అంటూ ఒక్కొక్కురుగా బయటికొచ్చారు. అనంతరం.. గాయపడిన గోపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

టైగర్‌ రిజర్వ్‌కు దగ్గరగా ఉండడంతో తమ గ్రామంలోకి తరచూ పులులు చొరబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో చూడండి: