Viral Video: ఇతర ప్రయాణీకులు చూస్తూనే ఉన్నారు.. కదులుతున్న ట్రైన్ లో ప్రయాణీకుడి ఫోన్ దొంగలించిన పోలీస్..

కదులుతున్న ట్రైన్ లో హాయిగా నిద్రపోతున్న ప్రయాణీకుల వస్తువులను, సెల్ ఫోన్లు దొంగిలించబడుతున్న సంగతి తెలిసిందే. దొంగలు చాకచక్యంగా ఎలా వస్తువులు దొంగలిస్తున్నారో తెలియజేసే రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. అయితే తాజాగా కదులుతున్న రైలులో ఒక వ్యక్తి జేబులోంచి పోలీసులు ఫోన్ దొంగిలించాడు. ప్రస్తుతం ఈ వీడియోలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. అయితే ఇది ప్రజలకు అవగాహన కల్పించడానికి రైల్వే పోలీసులు ఈ వీడియోను రూపొందించారు.

Viral Video: ఇతర ప్రయాణీకులు చూస్తూనే ఉన్నారు.. కదులుతున్న ట్రైన్ లో ప్రయాణీకుడి ఫోన్ దొంగలించిన పోలీస్..
Viral Video
Image Credit source: X/@geetappoo

Updated on: Jul 08, 2025 | 8:35 PM

రైలులో ప్రయాణించేటప్పుడు తమ వస్తువులను రక్షించుకోవడం ప్రయాణీకుల బాధ్యత. అయినప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) దొంగతనం వంటి సంఘటనలను నివారించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం RPF కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అవగాహన ప్రచారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా ప్రయాణీకులకు దొంగ తనం ఎలా జరుగుతుంది.. వాటిని ఎలా నివారించాలో అవగాహన కల్పిస్తున్నారు. రైల్వే పోలీసులు ప్రయాణీకులకు ఫోన్ దొంగతనం వంటి సంఘటనలను ఎలా నివారించాలో నేర్పుతున్నారు.

వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక RPF జవాన్ రైలు జనరల్ బోగీలో నిద్రిస్తున్న ప్రయాణీకుడి మొబైల్‌ను దొంగతనంగా తన జేబులోంచి తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీటుపై నిద్రప్తున్న ప్రయాణీకుడికి తన సెల్ ఫోన్ ను ఎవరో తీసుకుంటున్నారు అన్న విషయాన్నీ కూడా గుర్తించలేదు. దీని తర్వాత పోలీసులు ఆ ప్రయాణీకుడిని నిద్రలేపి మీ ఫోన్ ఎక్కడ అని అడిగాడు. అప్పుడు ఆ ప్రయాణీకుడు తన ఫోన్ కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడు ఆ పోలీసులు ఫోన్‌ను పై జేబులో పెట్టుకుని అంత గాఢంగా నిద్రపోవడం తన తప్పు అని చెప్పి, పోలీసు అతనికి ఫోన్ తిరిగి ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో రైల్వే పోలీసు ప్రయాణీకుడికి, రైలులో ఉన్న ఇతర ప్రయాణీకులందరికీ ఫోన్‌ను ఎల్లప్పుడూ ప్యాంటు జేబులో ఉంచుకోవాలని సలహా ఇచ్చాడు. ఇలా ఫ్యాంట్ జేబులో ఫోన్ ను పెట్టుకుంటే.. దొంగలు ఆ ఫోన్‌ను బయటకు తీయడం కష్టం.. పైగా మీకు ఆ విషయం తెలుస్తుంది కూడా… అప్పుడు దొంగతనం జరిగే అవకాశం కూడా తగ్గుతుంది. @geetappoo హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 88 వేలకు పైగా వీక్షించారు. దీనికి దాదాపు 2 వేల లైక్‌లు వచ్చాయి.

కదిలే రైలులో మీ ఫోన్ ఎలా దొంగిలించబడుతుందో ఇక్కడ వీడియో చూడండి.

దాదాపు 2 నిమిషాల ఈ వీడియోను నెటిజన్లు లైక్ చేస్తున్నారు. అంతేకాదు దీనిపై చాలా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇది చాలా మంది కార్యక్రమం. ప్రజలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. ట్రైన్ కదులుతూ పెద్ద శబ్దం చేస్తున్నా కూడా హాయిగా నిద్రపోయిన ప్రయాణీకుడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..