AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూబాడైవర్ చెంప చెల్లుమనిపించిన సముద్ర తాబేలు.. ఇదిగో వీడియో!

సోషల్‌ మీడియాలో తరచూ అనేక వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని నెటిజన్లను ఆకర్షిస్తే.. మరికొని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ వ్యక్తి అండవర్ వాటర్‌లో డైవింగ్ చేస్తుండగా.. ఓ సముద్రపు తాబేలు అతనితో ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకూ ఈ తాబేలు ఏం చేసింది. ఆ వీడియోలో ఏముందో చూద్దాం పదండి.

Viral Video: స్కూబాడైవర్ చెంప చెల్లుమనిపించిన సముద్ర తాబేలు.. ఇదిగో వీడియో!
Viral Sea Turtle Video
Anand T
|

Updated on: May 03, 2026 | 4:05 PM

Share

క్రిస్టోఫర్ చాంగ్ అనే ఓ ట్రావెలర్ తీసిన అండర్ వాటర్ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో అతనూ సముద్రంలో స్కూబాడైవింగ్ చేస్తూ అండర్‌ వాటర్‌లో ఓ వీడియో రికార్డు చేశాడు. అయితే అతను సముద్రంలో నీటిలో ఉండగా ఓ సముద్ర తాబేలు అతనివైపునకు దూసుకొచ్చింది. అయితే సాధారణంగా తాబేళ్లు మానవులను చూస్తే క్షణాల్లో అక్కడి నుంచి దూరంగా వెళ్తాయి. కానీ ఈ తాబేటు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోకుండా చాంగ్ చుట్టూనే తిరుగడం స్టార్ట్ చేసింది.

చాంగ్‌ను చెంపదెబ్బ కొట్టిన తాబేలు

అతను ఎటు వెళ్లినా, అది తన చూట్టే తిరుగుతూ వచ్చింది. ఓ క్రమంలో ఆ తాబేలు చాంగ్‌ను గమనిస్తూ, నేరుగా అతనిపైనకు దూసుకొచ్చి అతని చెంపపై చిన్నగా కొట్టేసి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఛాంగ్ సముద్రంలో తనకు ఎదునైన వింత అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. తన జీవితంలో వందల సార్లు తాబేళ్లను చూశాను కానీ, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదని అతను రాసుకొచ్చాడు.

నెటిజన్ల రియాక్షన్

అయితే చాంగ్ పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చి మరీ సౌండ్ చేస్తున్నావు, అందుకే అది నిన్ను నోరు మూసుకోమని కొట్టిందని ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేయగా.. తాబేలు పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే అలాగే ఉంటుందని మరో యూజర్ రాసుకొచ్చాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us