Viral Video: మురుగు కాల్వలో ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీరు.. ఈత కొడుతున్న అందమైన చేపలు.. ఎక్కడో తెలుసా..?

|

Sep 24, 2023 | 7:32 PM

ప్రస్తుతం ఇక్కడ మురుగు కాల్వలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక్కడి మురుగు కాలువల్లో రంగు రంగుల చేపలు ఈదుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ కాలువలు ప్రవహించే నదులలా స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కాలువలలో

Viral Video: మురుగు కాల్వలో ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీరు.. ఈత కొడుతున్న అందమైన చేపలు.. ఎక్కడో తెలుసా..?
Colorful Japanese Koi Fish
Follow us on

మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మనందరి తప్పనిసరి బాధ్యత కూడా. ఎందుకంటే మీరు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోతే, దేశం ఎప్పటికీ అపరిశుభ్రంగానే ఉండిపోతుంది.. అయితే, ప్రస్తుతం ఎక్కడ చూసినా మలినాల్ని వ్యాపింపజేస్తూ గర్వంగా భావించే వారితో నిండిపోయింది దేశం. అందరి నిర్లక్ష్యంగ కారణంగానే మన డ్రెయిన్లు, మురుగు కాలువలు మురికితో నిండిపోయి ఉంటాయి. కానీ, జపాన్‌లోని కాలువలు చాలా శుభ్రంగా ఉంటాయని మీకు తెలుసా.. అక్కడి డ్రైనేజీ కాలువలో కూడా శుభ్రమైన నీరు ప్రవహిస్తుంది.. అందులో ఆకాశం నిడా కూడా కనిపిస్తుందంటే నమ్మాల్సిందే..అందుకు ఉదాహరణ నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 1.5 మిలియన్లు అంటే 15 లక్షలకు నెటిజన్లు వీక్షించారు. అయితే ఈ వీడియోను 1 లక్ష 95 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు జనాలు రకరకాలుగా రియాక్షన్స్ ఇచ్చారు. వైరల్‌ అవుతున్న వీడియోలో డ్రైనేజీ కాల్వల్లో మురికి కాకుండా అందమైన చేపలు ఈదుతున్నాయి.

జపాన్ చాలా విషయాలకు ప్రసిద్ధి చెందింది. అలాంటి ఆవిష్కరణలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. ఇవి ప్రజలను ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మురుగు కాల్వలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక్కడి మురుగు కాలువల్లో రంగు రంగుల చేపలు ఈదుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ కాలువలు ప్రవహించే నదులలా స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కాలువలలో రంగురంగుల చేపలు ఈత కొట్టడం కనిపించింది. నదీజలాల వంటి స్పష్టమైన మురుగు కాల్వలు జపాన్‌లోని నాగసాకిలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో timmy727 అనే ఐడి ద్వారా షేర్‌ చేశారు. ఇది ఇప్పటివరకు 1.5 మిలియన్లు అంటే 15 లక్షల సార్లు వీక్షించారు నెటిజన్లు. అయితే ఈ వీడియోను 1 లక్ష 95 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు జనాలు కూడా రకరకాలుగా రియాక్షన్స్ ఇచ్చారు. అందుకే జపాన్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం అని కొందరు అంటున్నారు. నేను జపాన్ వెళ్ళినప్పుడు ఈ స్థలాన్ని చూడకుండా ఎలా మిస్ అయ్యాను అని కొందరు అంటున్నారు. అదే సమయంలో, ఒక వినియోగదారు స్పందిస్తూ.. నేను జపనీస్‌ని. ఈ నీరు వరి సాగు కోసం విడుదల చేశారు.. కాబట్టి ఇది శుభ్రంగా ఉంది. ఇది మురుగు నీరు కాదని అంటున్నారు. .

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..