VIRAL VIDEO : చిరుతపులిని ఆటపట్టించిన కోతి..! వీడియో చూస్తే నవ్వలేకుండా ఉండలేరు..

VIRAL VIDEO : సోషల్ మీడియాలో మిలియన్ల చిత్రాలు, జంతువుల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని

VIRAL VIDEO : చిరుతపులిని ఆటపట్టించిన కోతి..! వీడియో చూస్తే నవ్వలేకుండా ఉండలేరు..
Monkey Teased Leopard

Updated on: Jun 22, 2021 | 10:13 PM

VIRAL VIDEO : సోషల్ మీడియాలో మిలియన్ల చిత్రాలు, జంతువుల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీ అయితే మరికొన్ని అందమైనవి. కొన్ని వీడియోలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడతాయి. ఇందులో జంతువులు ఒకరినొకరు వేటాడటం చూడవచ్చు. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు గెలవడానికి బలం మాత్రమే కాదు తెలివి కూడా అవసరమవుతుంది. అటువంటి వైరల్ వీడియోలో ఒక కోతి తన తెలివితేటలతో చిరుతపులిని ఆటపట్టించడం చూడవచ్చు.

జంతువులకు సంబంధించిన కంటెంట్ ఇంటర్నెట్‌లో ఎక్కువగా చూసే కంటెంట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఒక వైరల్ వీడియోలో ఒక కోతి వేట కోసం వచ్చిన చిరుతపులిని ఆడుకుంటుంది. ఈ వీడియోలో చిరుతపులి ఒక ఎత్తైన చెట్టు ఎక్కి కోతిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ కొంటె కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ చిరుతపులిని ఇబ్బందికి గురిచేస్తుంది. మీరు ఈ ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.

ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే పేజీలో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఒక వినియోగదారు కోతి నిజంగా బుద్ధిమంతుడని చెప్పాడు. ప్రజలు ఈ వీడియో క్లిప్‌ను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడమే కాకుండా దానిపై వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏ యుద్ధంలోనైనా గెలవాలంటే జ్ఞానం అవసరం బలం కాదు అని కోతి ఖచ్చితంగా రుజువు చేస్తోంది.

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: 32 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్.. ఐదో రోజు 249 పరుగులకు ఆలౌట్‌

Vijayashanthi: భవిష్యత్‌లో కేవలం ఒకే ఒక్క సినిమాలో..! అది కూడా ఆ ఇద్దరిలో ఒకరికి సోదరిగా !

Telangana Ed-CET: ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు మ‌రోసారి పెంపు.. ఎప్ప‌టివ‌ర‌కు అవ‌కాశ‌ముందంటే..