Viral Video: 4 కోట్ల మందికి పైగా చూసిన వీడియో .. రెయిలింగ్‌లో ఇరుక్కున్న హంస మెడ.. అల్లాడుతుంటే సాయం చేసిన మనిషి..

|

Feb 18, 2024 | 7:58 PM

ఈ భూమిపై మానవత్వం కంటే పెద్ద మతం ఏదీ లేదని పెద్దల చెప్పింది వినే ఉంటారు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం దొరికినప్పుడల్లా.. ఖచ్చితంగా సహాయం చేయాలి. అయితే ప్రస్తుతం మానవత్వం పూర్తిగా ప్రజల నుండి కనుమరుగైంది. పశుపక్షాదులను మాత్రమే కాదు.. ఏ మానవుడూ మరొక మనిషికి సహాయం చేయడానికి సిద్ధంగా లేడు. అయితే కొందరు వ్యక్తులు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా స్పందిస్తూ మానవత్వం ఇంకా పూర్తిగా అంతరించి పోలేదని.. సజీవంగా కొందరి వ్యక్తుల రూపంలో ఉందని నిరూపిస్తున్నారు. 

Viral Video: 4 కోట్ల మందికి పైగా చూసిన వీడియో .. రెయిలింగ్‌లో ఇరుక్కున్న హంస మెడ.. అల్లాడుతుంటే సాయం చేసిన మనిషి..
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో రోజూ రకరకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలు చాలా వరకు హాస్యభరితంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని రకాల వీడియోలు  చూస్తే మనం ఎమోషనల్ అవుతాం. అంతేకాదు ఈ భూమిపై మానవత్వం ఇంకా సజీవంగా ఉందని చెప్పగలిగే కొన్ని రకాల వీడియోలను మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. అందులో ఒక హంస కంచెలో చిక్కుకుపోయింది. ఆ కంచె నుంచి తనని తాను విడిపించుకోవడానికి చాలా కష్టపడింది. అయితే హంస పడుతున్న కష్టాన్ని చూసిన ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు.

ఈ భూమిపై మానవత్వం కంటే పెద్ద మతం ఏదీ లేదని పెద్దల చెప్పింది వినే ఉంటారు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం దొరికినప్పుడల్లా.. ఖచ్చితంగా సహాయం చేయాలి. అయితే ప్రస్తుతం మానవత్వం పూర్తిగా ప్రజల నుండి కనుమరుగైంది. పశుపక్షాదులను మాత్రమే కాదు.. ఏ మానవుడూ మరొక మనిషికి సహాయం చేయడానికి సిద్ధంగా లేడు. అయితే కొందరు వ్యక్తులు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా స్పందిస్తూ మానవత్వం ఇంకా పూర్తిగా అంతరించి పోలేదని.. సజీవంగా కొందరి వ్యక్తుల రూపంలో ఉందని నిరూపిస్తున్నారు.  వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్న హంసకు సహాయం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

హంస మెడ ఇనుప రెయిలింగ్‌లో ఇరుక్కుపోయి ఉండడాన్ని వీడియోలో చూడవచ్చు. అది చాలా కష్టపడుతోంది. తనను తాను విడిపించుకోలేకపోతోంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి హంస మెడను ఒక చేత్తో పట్టుకుని రెయిలింగ్ నుండి వేరు చేశాడు.  అయితే ఇంకొంత సేపు హంస ఆ రెయిలింగ్ లోనే ఉంటే.. ఖచ్చితంగా మరణించేది.

ఈ వీడియో @JoshyBeSloshy అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త సమయానికి  నాలుగు కోట్ల మందికి పైగా చూశారు. రకరకాల  కామెంట్ చేస్తూ తమ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒకరు   చూడడానికి బాగుంది. మరొకరు వ్యాఖ్యానించారు చాలా మంచి పని. ఇలాంటి నోరు లేని జంతువులకు సహాయం చేస్తూ ఉండండి.  అద్భుతమైన పని అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..