Viral Video: ఇదేందయ్యా ఇది..నేనేడా సూడలా… ముంబైని రక్షించిన స్పైడర్‌ మ్యాన్‌ అంటూ మీమ్స్‌

ఇటీవల భారీ వర్షాలతో ముంబైలో ఎటు చూసిన జలదృశ్యమే కనిపించింది. నగరంలో రోడ్లు నదులను తలపించాయి. భారీ వర్షాలు వరదలతో ముంబైలో అడుగడుగునా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. మెరైన్‌ డ్రైవ్‌ , గేట్‌ వే ఆఫ్‌ ఇండియా ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది...

Viral Video: ఇదేందయ్యా ఇది..నేనేడా సూడలా... ముంబైని రక్షించిన స్పైడర్‌ మ్యాన్‌ అంటూ మీమ్స్‌
Spider Man Mumbai Floods

Updated on: Sep 02, 2025 | 6:13 PM

ఇటీవల భారీ వర్షాలతో ముంబైలో ఎటు చూసిన జలదృశ్యమే కనిపించింది. నగరంలో రోడ్లు నదులను తలపించాయి. భారీ వర్షాలు వరదలతో ముంబైలో అడుగడుగునా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. మెరైన్‌ డ్రైవ్‌ , గేట్‌ వే ఆఫ్‌ ఇండియా ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 3.75 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ముంబైని రక్షించడానిక స్పైడర్‌ మ్యాన్‌ రావాల్సి వచ్చింది. ఒక కామిక్ పుస్తకంలో జరిగిన సంఘటనల వలెనే నాటకీయంగా జరిగిందీ సంఘటన స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి ముంబైలోని నీటితో నిండిన వీధులను శుభ్రం చేస్తూ కనిపించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో అతను స్పైడర్ మ్యాన్ వెబ్-స్లింగ్ శక్తులతో కాకుండా, వైపర్‌తో వరదలున్న వీధిని తుడిచిపెడుతున్నట్లు కనిపించాడు. వైరల్ అయిన తర్వాత ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్స్‌ పెడుతున్నారు. వారు తమ ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు.

వీడియో చూడండి:

నెటిజన్లు క్లిప్‌ను షేర్ చేస్తున్నారు.సూపర్ హీరో కొత్త పాత్ర గురించి మీమ్స్, జోకులు సృష్టిస్తున్నారు. ఒక వినియోగదారు, “రియల్ స్పైడర్‌మ్యాన్ ఆఫ్ ముంబై” అని అన్నారు. “స్పైడర్ మ్యాన్ నీటిలోకి దిగుతున్నాడు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “స్పైడర్ మ్యాన్ ముంబై కో బచానే కే మిషన్ పార్” అని మరొకరు జోక్ చేశారు.