
Viral Video: ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పాము తనను తాను తింటున్నట్లు కనిపించించే వీడియో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోకు ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మచ్చలున్న కింగ్‌స్నేక్ దానికి అదే తినేందుకు ప్రయత్నిస్తోంది. దాని వెనుక భాగాన్ని తనకు అదే తింటున్న దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. యజమాని రాబ్ క్లార్క్ వెనిటాక్స్ పామును ఆపడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ వీడియోలో పాము తన తోక భాగాన్ని తినడాన్ని చూడవచ్చు. దాని శరీరంలో ఎక్కువ భాగం మింగేసింది. అయితే ఆ పాము యజమాని పాము తలపై హ్యాండ్ శానిటైజర్‌ను పూసేందుకు ప్రయత్నించాడు. ఒక విషయం ఏంటంటే పాములు హ్యాండ్ శానిటైజర్లను ఇష్టపడవు.
అయితే పాములకు ఆ శానిటైజర్ వాసన పడదు. అందుకు ఆ వ్యక్తి పాము తలపై శానిటైజర్ పూయగానే వెంటనే నోటి నుంచి విడిచిపెట్టింది ఆ పాము. ప్రమాదవశాత్తూ పాము తలపై కాకుండా కళ్లపై శానిటైజర్‌ను పెట్టానని, అందుకే అది ఎగిరి గంతేస్తోందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. పాములు వాటి కళ్లను రక్షించే స్పష్టమైన పొలుసులను కలిగి ఉంటాయి. కాబట్టి దాని కళ్ళు హ్యాండ్ శానిటైజర్ ద్వారా అస్సలు ప్రభావితం కాలేదు అని ఆయన స్పష్టం చేశారు. పాము తనను తాను ఎందుకు తింటుందో, ఆ వ్యక్తి ఇలా వివరించాడు, రాజుపాములు ఇతర పాములను తింటాయి. అలాగే కొన్ని పాములు ఇలా తనను తాను తింటుంటాయి. ఒత్తిడి, ఆకలి లేదా ఉష్ణోగ్రతలు చాలా వెచ్చగా ఉండటం వల్ల ఇది జరిగిందని కొందరు భావిస్తుంటారు. ఏది ఏమైనా శానిటైజర్ ను దాని ముందు పూయడంతో ఒక్కసారిగా మింగేయడం ఆపివేసి తన తలను వెనక్కి లాగేసుకుంది. ప్రస్తుతం ఈ పాము తనను తాను మింగేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: