Viral Video: లంబోర్గిని కారుకు చుక్కలు చూపించిన వీధి కుక్క… కుక్క దాదాగిరికి నెటిజన్స్‌ ఫిదా

రోడ్డుమీద పాదాచారులకు, వాహనదారులకు వీధి కుక్కలు ఒక్కోసారి పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు మూకుమ్మడిగా మీదపడి దాడి చేస్తాయి. ఇటీవల అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఓ వీడియో మాత్రం నెటిజన్స్‌కు ఆసక్తిని...

Viral Video: లంబోర్గిని కారుకు చుక్కలు చూపించిన వీధి కుక్క... కుక్క దాదాగిరికి నెటిజన్స్‌ ఫిదా
Lamborgini Car Vs Dog

Updated on: Jul 16, 2025 | 12:58 PM

రోడ్డుమీద పాదాచారులకు, వాహనదారులకు వీధి కుక్కలు ఒక్కోసారి పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు మూకుమ్మడిగా మీదపడి దాడి చేస్తాయి. ఇటీవల అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఓ వీడియో మాత్రం నెటిజన్స్‌కు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ వీడియోలో, ‘లంబోర్గిని ముందు ఓ వీధి కుక్క దాదాగిరి చేస్తుండటాన్ని చూసి నెటిజన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు.

ముంబైలోని వత్సలబాయి దేశాయ్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను బట్టి తెలుస్తోంది. రోడ్డుపై ఒక లేన్‌లో చాలా వాహనాలు నడుస్తున్నట్లు చూడవచ్చు. తర్వాత ఒక నారింజ రంగు లంబోర్గిని పక్క నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరుసటి క్షణంలో ఏమి జరిగిందో చూడటం మాత్రం ఆపేయొద్దు. లంబోర్గిని వేగం పుంజుకోబోతుండగా అకస్మాత్తుగా ఒక కుక్క వచ్చి దాని ముందు నిలబడింది. డ్రైవర్ హారన్ మోగిస్తూ వాహనాన్ని పక్క నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ సమయ్యంలో కుక్క ‘వైఖరి’ చూడాల్సిందే. ఆ కుక్క కారు ఎదురుగా నిల్చుని ఒక్క ఇంచు కూడా కదలకుండా ఉంటుంది. ఈ రోజు ఎలాగైనా ఈ కారును వదలకూడదని కుక్క నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది.

కుక్క దాదాగిరిని చూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు. ఈ దృశ్యాన్ని చూస్తే, కుక్క ‘బెదిరింపు’ ప్రారంభించినట్లు అనిపిస్తుంది. అప్పుడు లంబోర్గినితో ఉన్న వ్యక్తి ఏదో విధంగా కారును తీసి అక్కడి నుండి పారిపోతాడు. కానీ కుక్క అప్పటికీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు, లంబోర్గిని వెంట పరుగెత్తుతుంది.

వీడియో చూడండి:

ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఒక వినియోగదారు సరదాగా, టామీకి ఏమి అర్థమైందో, షెరు హై అపున్ అని రాశారు. మరొకరు, ఇది అద్భుతమైన బెదిరింపు అని అన్నారు. డోగేష్ భాయ్‌తో గొడవ పడకండి అంటూ మరొక వినియోగదారు కామెంట్‌ చేశారు.