Viral video: ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయి.. కట్ చేస్తే.. పోకిరి లెవల్ ట్విస్ట్

|

Nov 15, 2024 | 3:35 PM

ఈరోజుల్లో కుర్రకారు ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్లిన ఫోన్ చేతిలో ఉండాల్సిందే.. ఈ ఫోన్‌కు ఎంతలా అడిక్ట్ అయ్యారంటే ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదు. ఫోన్లో లీనమై కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న వారికి మనం చూసి ఉంటాం.. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి జరిగింది.

Viral video: ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయి.. కట్ చేస్తే.. పోకిరి లెవల్ ట్విస్ట్
Viral Video Shows Car Hitting Woman Distracted By Phone
Follow us on

సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను దాటుతున్న సమయంలో ఒక మహిళ తన ఫోన్‌లో లీనమై ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ద్వారా రికార్డ్ చేయబడిన ఫుటేజ్ నెటింట్లో ట్రెండింగ్‌గా మారింది. మహిళ తన ఫోన్‌లో నిమగ్నమై, రెడ్ లైట్‌ను పట్టించుకోకుండా రోడ్డు దాటుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. గ్రీన్ లైట్‌ ఉండడంతో ఓ కారు ముందుకు వెళుతుండగా ఆ మహిళ అడ్డు రావడంతో కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది?

మహిళ పరిస్థితిని చెక్ చేయడానికి డ్రైవర్ త్వరగా కారు నుండి దిగి బయటకు వచ్చాడు. అయితే, మహిళ లేచి కూర్చుని, తన గాయాలను చెక్ చేసుకోకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. ఇది అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది. నవంబర్ 13 అర్ధరాత్రి ఈ సంఘటన జరిగిందని సింగపూర్ మీడియా నివేదించింది. X ఖాతా @OnlyBangersEth ద్వారా పోస్ట్ చేయబడిన ఈ వీడియో మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. కారు ఢీకొన్న వెంటనే అమ్మాయి తన ఫోన్‌ని చెక్ చేసిందని నెటిజన్లు గమనించారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్లకు డ్యాష్‌బోర్డ్ కెమెరాను కలిగి ఉండటం ఎంత కీలకమని కొందరు కామెంట్లు పెడుతున్నారు. తీవ్రమైన గాయం తర్వాత ఆమె ఫస్ట్ ప్రియరిటీ ఏంటంటే ఫోన్‌ను వెతుకోవడమేనని సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. “ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఫోన్ మీ చేతుల్లో ఉండకూడదు. అలా అయితేనే రోడ్డుపైన సేఫ్‌గా ఉంటారు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ప్రజలు నడుస్తున్నప్పుడు వారి ఫోన్‌లను వాడడం మానేయాలి!!! ఇది ప్రతీ దగ్గర జరుగుతుంది. కొందరు ఇడియట్లు తమ ఫోన్‌లను చూస్తూ మెట్లు ఎక్కడం లేదా నడుస్తున్నారు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ సంఘటన నెటింట్లో చర్చకు దారితీసింది. “సోషల్ మీడియా హెడ్ డౌన్ జనరేషన్” అని మరికొందరు సెటైరికల్‌గా కామెంట్లు పెడుతున్నారు.

వీడియో ఇదిగో:

ఒక నెల క్రితం, బ్యూనస్ ఎయిర్స్‌లో ఇదే విధమైన ఓ సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టిన వీడియోను మరొక్క వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన ఫోన్‌లో నిమగ్నమై ఉన్న వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా.. సరిగ్గా అదే సమయానికి రైలు వ్తస్తుంది. అయితే ఆ వ్యక్తి అదృష్టం బాగుండి ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ అతని చేతులో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నానని ఆనందపడకుండా ఫోన్ పోయిందని షాక్‌తో నేలమీద కుప్పకూలిపోయాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి