నదులు, సముద్రాల్లో ఉండే మొసళ్లను మనం అప్పుడప్పుడూ జూలలో చూస్టుంటాం. ఈ మధ్య వర్షాలు వరదలకు ఎక్కడెక్కడినుంచో మొసళ్లు కొట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన సంఘటనలు చూశాం. సాధారణంగా ఒక్క మొసలిని చూస్తేనే గుండెజారినంతపనవుతుంది. అలాంటిది ఇక్కడ ఓ నదినిండా మొసళ్లే.. ఏకంగా నదిలో కుప్పలు కుప్పలుగా చేపలు ఈదుతున్నట్టు మొసళ్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి మధ్యలోనుంచి ఓ మత్స్యకార బోటు దూసుకెళ్తోంది. ఆ సమయంలో మొసళ్లు పక్కకు పరుగులు తీస్తూ బోటుకు దారిస్తున్నాయి. ఆ భయంకర జీవులమధ్యంనుంచి బోటులో దూసుకెళ్తోన్న వారి ధైర్యానికి హ్యాట్సాప్ అనాల్సిందే.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఆఫ్రికాలోని ఓ నదిలో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఓ వినియోగదారుడు తన ట్విట్టర్ తన ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
A terrifying boat pass through a river pic.twitter.com/PZVx55wHWM
— CCTV IDIOTS (@cctvidiots) August 16, 2023
భూలోకంలో నరకలోకమని, అసలు అక్కడికి ఆ పడవలో వెళ్లాల్సిన అవసరం ఏమిటని నెటిజన్లు కామెంటుతున్నారు. అంతేకాదు మరికొందరు.. పడవ నుంచి పట్టుతప్పి నదిలో పడితే ఇక అతను మొసళ్లకు ఆహారమే అవుతాడని.. కనీసం గుర్తు పట్టడానికి కూడా మిగలడంటూ ఎముక కూడా మిగలదని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..