Viral Video: మొబైల్ పిచ్చి పీక్స్.. ఫోన్ చూస్తుండగా కదిలిన ట్రైన్.. ఈ వృద్దుడు ఏం చేశాడంటే.. షాకింగ్ వీడియో

పిల్లలు పెద్దలు అనే తేడా లేదు ఎవరికైనా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. లోకం మరచిపోతున్నారు. చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కూడా తెలియనంతగా మొబైల్ ఫోన్ లో చూడడంలో నిమగ్నం అయి ఉంటారు. నడుస్తున్న వారు మొబైల్ ఫోన్ చూస్తూ కొన్ని సార్లు తమ గమ్యం దాటి వెళ్ళిపోతూ ఉంటారు కూడా.. ఇలాంటిదే రైల్వే స్టేషన్‌లో కూర్చున్న ఒక వృద్ధుడికి జరిగింది. మొబైల్ ఫోన్ చూడడంలో లోకాన్ని మరచిపోయిన వృద్దుడికి రైలు బయలుదేరిందని కూడా తెలియలేదు. ఆ తర్వాత ఈ వృద్ధుడు ఏమి చేసాడో వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: మొబైల్ పిచ్చి పీక్స్.. ఫోన్ చూస్తుండగా కదిలిన ట్రైన్.. ఈ వృద్దుడు ఏం చేశాడంటే.. షాకింగ్ వీడియో
Viral Video
Image Credit source: Twitter

Updated on: Jul 25, 2025 | 1:00 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మొబైల్ వ్యసనంగా మారిపోయింది. ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఫోన్ వైపు మనసు వెళ్ళిపోతుంది. దానిని చూస్తూ సమయం గడుపుతున్నారు. అవును ఇలా సెల్ ఫోన్ చూస్తూ సమయం ఎంత అయింది అనే విషయాని కూడా గమనించడంలేదు. ఒకొక్కసారి ఇలా సెల్ ఫోన్ చూడడం వలన కలిగే సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మొబైల్‌ను ఎక్కడ బడితే అక్కడ చూస్తూ ఉండిపోకూడదు అని కూడా అనుకుంటారు.

వైరల్ వీడియోలో రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక వృద్ధుడు రైలు బయలుదేరడానికి ఇంకా సమయం ఉండి ఆలోచించినట్లు ఉన్నాడు.. దీంతో తన మొబైల్‌ను చూస్తూ కూర్చున్నాడు. మొబైల్ చూడడంలో మునిగిపోయిన వృద్ధుడు రైలు బయలుదేరిందనే విషయాన్ని గ్రహించలేదు. కొంత సమయం తర్వాత రైలు బయలుదేరిందని గ్రహించాడు.. దీంతో గబగాబగా ఆ వృద్ధుడు కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే.. అయితే రైల్వే పోలీసు వలన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన బేతుల్ రైల్వే స్టేషన్‌లో జరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా బానిసలారా రైళ్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటూ క్యాప్షన్ తో @jsuryareddy అనే మాజీ ఖాతాదారుడు ఈ వీడియో షేర్ చేశాడు. బేతుల్ రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి ప్రాణాలను కాపాడిన RPF కానిస్టేబుల్ సత్య ప్రకాష్ రాజూర్కర్ కి సంబంధించిన వీడియో ఇది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన 66 ఏళ్ల వ్యక్తిని ఆయన రక్షించారు. ఈ సంఘటన CCTVలో రికార్డైంది. “స్టేషన్లలో మొబైల్ ఫోన్లు వినియోగాన్ని తగ్గించుకుని గందరగోళాన్ని నివారించండి” అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై కూర్చుని తన మొబైల్ ఫోన్‌ను చూస్తున్న ఒక వృద్ధుడిని చూడవచ్చు. తన మొబైల్ ఫోన్‌లో మునిగిపోయిన ఆ వృద్ధుడు రైలు వెళ్లిపోతుందనే విషయాన్నీ కూడా గమనించలేదు. కొంత సమయం తర్వాత రైలు కదిలిపోతుందని గ్రహించిన అతను ఏమి చేయాలో తెలియక వేగంగా వెళ్తున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే రైలు వేగ ఎక్కువగా ఉండటంతో ఆ వృద్ధుడు కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సత్య ప్రకాష్ రాజుర్కర్ ఆ వృద్ధుడిని తన ప్రాణాలకు తెగించి.. ట్రాక్ మీద వృద్ధుడు పడకుండా చేశాడు.

జూలై 21న షేర్ చేయబడిన ఈ వీడియోలో RPF కానిస్టేబుల్ చూపిన చొరవకి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిచోటా కూర్చుని మొబైల్ చూసే వ్యక్తులకు ఈ వీడియో ఒక పాఠం కావాలని మరొకరు వ్యాఖ్యానించారు. నేటి ప్రజలు మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారు. మొబైల్ ఫోన్లు లేకపోతే ప్రపంచం లేనట్లు అనిపిస్తోందని మరొకరు వ్యాఖ్యానించారు.

 

మరిన్ని వైరల్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి