కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓ పులితో పాటు యువకుడు పడవలో సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఇందులోని పులిలాగే ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పేరుకు తగ్గట్లుగానే ఈ వీడియోలో ఓ పులి ఎంతో రాజసంగా బోట్ నుంచి నీటిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోవడం మనం చూడవచ్చు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని అటవీ ప్రాంతం నుంచి ఓ రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) జనావాస ప్రాంతాల్లోకి వచ్చింది. జనాలు తీవ్ర భయాందోళనకు గురికాడంతో అటవీ శాఖ అధికారులు ఆ పులిని బంధించారు. ఆ తర్వాత సుందర్ బన్స్ అటవీ ప్రాంతంలో పులిని విడిచిపెట్టేందుకు దాన్ని ఓ పడవలోకి ఎక్కించారు. తీరానికి కొంచెం సమీపంలో బోటును నిలిపేసి.. బోను నుంచి పులిని వదిలారు. దీంతో ఆ పులి వెంటనే నీటిలోకి దూకింది. వెనక్కి కూడా తిరిగి చూడకుండా.. అటవీ ప్రాంతం వైపు ఈదుకుంటూ వెళ్లింది. చివరకు ఒడ్డుకు చేరి అడవిలోకి వెళ్లిపోయింది.
బెంగాల్ టైగర్ బాగా స్విమ్ చేస్తుందే!
దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్‌ఎస్) పర్వీన్ కల్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి థ్రిల్‌కు గురయ్యారు. ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుకొస్తుంది’, ‘ఇదేదోరిచర్డ్ పార్కర్(లైఫ్ ఆఫ్ పైలో పులి పాత్ర పేరు) కన్నా వరెస్ట్‌గా ఉన్నాడు’, ‘బెంగాల్ టైగర్ బాగా ఈదుతుందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 17, 2022
Also Read:RR vs KKR, IPL 2022: చాహల్ ‘పాంచ్’ పటాకా.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ గెలుపు..
Covid 19: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ నాలుగు జిల్లాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి..!