Viral Video: కొండచిలువను ఎదిరించిన పిల్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే. జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ప్రమాదకరమైన పాము,..

Viral Video: కొండచిలువను ఎదిరించిన పిల్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

Updated on: Jul 24, 2022 | 9:49 PM

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే. జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ప్రమాదకరమైన పాము, పిల్లి మధ్య జరిగి పోరాటాన్ని చూస్తే ఎవరైనా షాక్‌ గురవాల్సిందే. పిల్లి పాముతో పోరాడటం మీరు ఎన్నడూ చూసి ఉండరు. ఓ పిల్లి తన పిల్లలతో ఉండగా, ప్రమాదకరమైన కొండచిలువ వాటిని తినేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ పిల్లి తనను, తన పిల్లలను రక్షించుకునేందుకు ఏ మాత్రం వెనుక్కి తగ్గకుండా పాముతో పోరాడటం గమనార్హం.

అకస్మాత్తుగా విషపూరితమైన పెద్ద కొండచిలువ (పైథాన్) పిల్లి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుంది. కొండచిలువ నేరుగా పిల్లిపై దాడి చేయడాన్ని ప్రయత్నిస్తుండగా, పిల్లి ఎదురు దాడికి దిగింది. పిల్లి తన పిల్లలను వెనకే ఉంచుకుని పాముతో పోరాడటం గర్వించదగ్గ విషయమే. తగిన రీతిలో పిల్లి పాముకు సమాధానం ఇచ్చింది. ఎలాగోలా పిల్లి పిల్లలతో పారిపోవాలని ప్రయత్నించి ఒక్కసారిగా పాము పట్టుకుంది పిల్లి. ఈ వైరల్‌ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో bestpet.in అనే ఖాతాతో పోస్టు చేయగా, లక్షలాది మంది చూసి లైక్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి