ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎలాంటి విపత్కర పరిస్థితులు తీసుకొచ్చిందో మనం చూశాం. ఈ క్రమంలో జనాలు బయలకు వెళ్లేందుకు పెద్దగా సాహసించడం లేదు. రెస్టారెంట్లు వైపు అస్సలు అడుగుపెట్టడం లేదు. ఎక్కువగా హోమ్ డెలివరీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో డెలివరీ బాయ్స్ అనేక సవాళ్లు ఎదుర్కుంటున్నారు. వారికి పని ఒత్తిడి పెరిగింది. రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేయాల్సి వస్తుంది. వీక్లి ఆప్స్ కూడా చిక్కడం లేదు. ఈ క్రమంలో డెలివరీ అనంతరం కస్టమర్స్ ఇచ్చే టిప్.. వారికి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. అయితే కస్టమర్స్ అందరూ టిప్ ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది టిప్ అడిగినా కూడా నిర్మొహమాటం నో చెప్తారు. తాజాగా ఓ వ్యక్తి మాత్రం డెలివరీ బాయ్‌కు టిప్ ఇచ్చేందుకు డబ్బు లేకపోవడంతో తీసుకొచ్చిన పిజ్జాలో షేర్ ఇచ్చేశాడు.
ముందుగా వీడియోను వీక్షించండి….
వీడియోను గమనిస్తే పిజ్జాను డెలివరీ చేసేందుకు కస్టమర్ ఇంటికి వెళ్లిన బాయ్.. బాక్స్‌ను ఇంటి ముందు పెట్టి డోర్ నాక్ చేశాడు. అనంతరం టిప్ ఇవ్వాలని కోరాడు. అయితే తన వద్ద డబ్బు లేదని.. ఒక పిజ్జా ముక్క తీసుకోమని కస్టమర్ చెప్పాడు. ఆశ్చర్యపోయిన సదరు డెలివరీ బాయ్…”నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని ప్రశ్నించాడు. లేదు, నిజంగానే తీసుకోమని.. కస్టమర్ చెప్పడంతో పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి.. అందులో నుంచి ఒక పీస్ తీసుకుని కూల్‌గా వెళ్లిపోయాడు సదరు డెలివరీ బాయ్. కాగా ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Also Read:రన్నింగ్ ట్రైన్‌కు వేలాడుతూ కనిపించిన గొర్రె.. ఏం జరిగిందా అని ఆరా తీయగా షాక్