Viral Video: ఓ తండ్రికి ఇంతకు మించి ఏం కావాలి..? హార్ట్ టచింగ్ వీడియో వైరల్

పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని రాత్రి పగలు కష్టపడతారు. అనుకున్నది సాధించి వారి ముందు సగర్వంగా నిలబడతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందం మాటల్లో చెప్పలేనిది.

Viral Video: ఓ తండ్రికి ఇంతకు మించి ఏం కావాలి..? హార్ట్ టచింగ్ వీడియో వైరల్
Father Daughter Love

Edited By:

Updated on: Jan 17, 2023 | 9:50 PM

తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో ఉన్నతస్థితికి చేరుకోవాలని, అన్నిరకాలుగా స్థిరపడాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించేందుకు పిల్లలకు తల్లిదండ్రులు వెన్నుదన్నుగా నిలుస్తారు. పిల్లల ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని రాత్రి పగలు కష్టపడతారు. అనుకున్నది సాధించి వారి ముందు సగర్వంగా నిలబడతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందం మాటల్లో చెప్పలేనిది.

కృతజ్ఞ్నా హేల్.. ఓ పైలట్. ఒక రోజు తను విధులు నిర్వహించే విమానంలో ఆమె తండ్రి ప్రయాణించారు. దీంతో థ్రిల్‌గా ఫీలైన ఆమె ఫ్లైట్‌ టేకాఫ్‌ ముందు తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. అనంతరం ప్రేమగా తండ్రిని కౌగలించుకుంది. దీంతో ఆ తండ్రి కూతురి విజయాన్ని కళ్లారా చూసి భావోధ్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన కృతజ్ఞ్నా ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది. ‘టేకాఫ్‌కు ముందు మా నాన్న బ్లెస్సింగ్స్‌ తీసుకున్నాను. నేను ప్రతిరోజూ ఇంటినుండి బయటకు వెళ్లేముందు అమ్మా,నాన్నల ఆశీస్సులు తీసుకునే వెళ్తాను. ఒక్కోసారి తెల్లవారుజామునే మూడు, నాలుగు గంటల సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు అమ్మ,నాన్నలు గాఢ నిద్రలో ఉంటారు. అయినా వారికి ఎలాంటి డిస్టర్బెన్స్‌ కలగకుండా వారి పాదాలను తాకి నమస్కించుకొని వెళ్తాను అంటూ రాసుకొచ్చింది. ఈ హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ముగ్దులయిపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో తల్లిదండ్రులను మించిన దైవం లేదు అంటున్నారు.

మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..