Viral Video: ఫోన్‌ పట్టుకొని ట్రైన్‌ డోర్‌ దగ్గర నిలబడుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!

ట్రైన్‌లో ప్రయాణించేప్పుడు కొందరు చల్లగాలి కోసమని, ప్రకృతి అందాలను చూసేందుకని, డోర్‌ దగ్గరకు వచ్చి నిల్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఏవైనా మంచి ప్రదేశాలు కనిపిస్తే ఫోన్‌లో వీడియోలు తీస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ఎంత ప్రమాదకరమో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ విడియోలో చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకు ఆ వీడియో ఏంటో చూద్దాం పదండి.

Viral Video: ఫోన్‌ పట్టుకొని ట్రైన్‌ డోర్‌ దగ్గర నిలబడుతున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!
Viral Video

Updated on: Jul 06, 2025 | 12:43 AM

ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ట్రైన్‌లో దొంగలు ఎక్కువగా ఉంటారు. ప్రయాణ సమయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు తమ చేతివాటం చూపేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోవడంతో చాలా మంది తమ వద్ద డబ్బులను పెట్టుకోవడం మానేశారు. దీంతో దొంగలకు దోచుకుందాంమంటే ఎవరి దగ్గరా డబ్బులు కనిపించట్లేదు.. అందుకే వాళ్లు కూడా ఇప్పుడు రూట్‌ మార్చారు. డబ్బులకు బదులుగా సెల్‌ఫోన్‌లు కొట్టేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు. ట్రైన్‌లోపలే కాదు.. ట్రైన్‌ బయట నుంచి కూడా ఫోన్‌లను కాజేసేందుకు దొంగలు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది.

ఓ సోషల్‌ మీడియా యూజర్ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ రైలు వేగంగా ప్రయాణిస్తుంది.. ఆదే సమయంలో ఓ వ్యక్తి రైలు పట్టాల పక్కన ఒక కర్రను పట్టుకుని నిలబడి ఉన్నట్టు మనం చూడవచ్చు. అయితే ఎవరైనా ఫోన్‌ పట్టుకొని ట్రైన్ డోర్ దగ్గర నిలబడితే వారిని టార్గెట్ చేసి.. వాళ్ల చేతిపై కర్రతో కొడుతున్నాడు. వాళ్ల చేతిలో ఉన్న ఫోన్‌ కిందపడగానే దాన్ని తీసుకొని పారిపోయాడు. దీన్నంత వీడియో కూడా తీశాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.