సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు చూసి ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆ వీడియోలు అలా ఉంటాయి మరి. అలాంటి వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అడ్వెంచర్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ హల్‌చల్ చేస్తున్నాయు. అయితే.. ప్రస్తుతం విదేశాల్లో సైకిళ్లపై స్టంట్ చేయడం చాలా ఎక్కువైంది. ఔత్సాహికులు సైకిళ్లపై ప్రత్యేకమైన విన్యాసాలు చేయడం, సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేయడం కనిపిస్తుంది. ఇటీవల, ఒక వ్యక్తి థ్రిల్లింగ్ స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి సైకిల్ హ్యాండిల్‌పై రెండు కాళ్లతో నిలబడి ర్యాంప్ నుంచి కింది వచ్చాడు. తనను తాను బ్యాలెన్సు చేసుకుంటూ సైకిల్‌ను అద్వితీయంగా ముందుకు తీసుకెళ్లాడు.
మీరు సైకిల్‌పై అనేక రకాల విన్యాసాలు చూసి ఉండవచ్చు, కానీ ఇలాంటి సాహసోపేతమైన వీడియో ఎక్కడా చూసి ఉండరు. విన్యాసాలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియో ఎక్కడిదో తెలియరాలేదు.
Read Also.. Watch Video: వావ్.. సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్.. సలాం కొడుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో