Viral Video: ప్రయాణంలో అపస్మారక స్థితిలోకి పైలెట్.. రంగంలోకి ఏమీ తెలియని పాసింజర్.. చివరకు

|

May 11, 2022 | 7:42 PM

సెస్నా లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతున్న పైలట్ ప్రయాణం మధ్యలో ఉండగా.. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో చాపర్‌లో పైలెట్‌తో పాటు ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. దీంతో...

Viral Video: ప్రయాణంలో అపస్మారక స్థితిలోకి పైలెట్.. రంగంలోకి ఏమీ తెలియని పాసింజర్.. చివరకు
Passenger lands plane after pilot falls unconscious
Follow us on

Trending News: ఫ్లైట్స్‌లో పైలెట్స్ గుండె పోటుకు గురైనప్పుడు.. లేదా పైలెట్స్‌ను టెర్రరిస్టులు చంపేసినప్పుడు.. ఫ్లైట్ గురించి ఏమాత్రం తెలియని అందులోని ప్రయాణీకుడు.. విమానాన్ని నడిపి… ప్రయాణీకులకు క్షేమంగా గమ్యస్థానాలకు తీసుకువచ్చిన ఘటనలు సినిమాల్లో చూసి ఉంటారు… నవలల్లో చదివి ఉంటారు. కానీ అలాంటిదే రియల్ సీన్ జరిగింది. సెస్నా లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతున్న పైలట్ ప్రయాణం మధ్యలో ఉండగా.. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో చాపర్‌లో పైలెట్‌తో పాటు ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణీకుడు పైలెట్‌ను తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అతడే రంగంలోకి దిగాడు. చాపర్‌ను అదుపు చేయడమే కాకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సహాయంతో విమానాన్ని సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.

తన గర్భవతి అయిన భార్యతో  ఊరు వెళ్లేందుకు ఓ  ప్రయాణీకుడు చాపర్ బుక్ చేసుకున్నాడు.  లైట్ సెస్నా 208 కారవాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అతడికి కేటాయించారు. ప్రయాణం షురూ అయ్యింది. అయితే పైలట్ మెడికల్ ఎమర్జెన్సీకి గురై అపస్మారక స్థితికి చేరుకోవడంతో అందులోని పాసింజర్ దానిని నియంత్రించి.. సేఫ్‌గా ల్యాండ్ చేసినట్లు నివేదికలు తెలిపాయి. విమానం బహామాస్‌లోని మార్ష్ హార్బర్‌లోని లియోనార్డ్ ఎం. థాంప్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం ఫ్లోరిడాకు బయలుదేరింది.  పైలట్ కుప్పకూలిన తర్వాత, అందులోని పాసింజర్ వ్యక్తి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి ఫోర్ట్ పియర్స్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి అత్యవసర పరిస్థితిని వివరించాడు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అతడిని స్థిమిత పరిచారు. అనంతరం చాపర్‌ను ఎలా ఆపరేట్ చేయాలో చెప్పారు. అతడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వచ్చిన సూచనలను అనుసరించాడు. చివరకు, పామ్ పీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెస్నా విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయగలిగాడు. అతను గతంలో ఎప్పుడూ విమానాన్ని నడపలేదని, అసలు దాని గురించి ఏం తెలియదని నివేదికలు తెలిపాయి.  పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చూపించే క్లిప్‌ను ఓ న్యూస్ రిపోర్టర్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.