Viral Video: ఐడియా అదిరింది భయ్యా!..ఇప్పటి దాకా ఏ రైల్లోనూ చూడలే… నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి రైలు ప్రయాణానికి మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటి ఉండదు. తక్కువ ధరలో, సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. అందుకే చాలామంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. కొందరు ఏసీ స్లీపర్‌లో ప్రయాణిస్తే సామాన్యులు ఎక్కువగా నాన్‌ ఏసీ, జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తారు. అలా నాన్‌ ఏసీలో...

Viral Video: ఐడియా అదిరింది భయ్యా!..ఇప్పటి దాకా ఏ రైల్లోనూ చూడలే... నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
Passenger Personal Air Cool

Updated on: Sep 05, 2025 | 6:21 PM

దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి రైలు ప్రయాణానికి మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటి ఉండదు. తక్కువ ధరలో, సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. అందుకే చాలామంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. కొందరు ఏసీ స్లీపర్‌లో ప్రయాణిస్తే సామాన్యులు ఎక్కువగా నాన్‌ ఏసీ, జనరల్‌ బోగీల్లో ప్రయాణిస్తారు. అలా నాన్‌ ఏసీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అదిరిపోయే ఐడియా వేశాడు. జనంతో కిక్కిరిసి ఉన్న ఆ బోగీలో అసలు గాలి ఆడటం లేదు. వాతావరణం కూడా వేడిగా ఉండటంతో జనాలు అల్లాడుతున్నారు. అయితే ఈ యువకుడు మాత్రం చక్కగా కూలర్‌ పెట్టుకొని హ్యాపీగా తన బెర్త్‌పై నిద్రపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోసల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆ యువకుడి ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.

ఇప్పటి వరకూ ఎవరూ చేయని పని ఆ వ్యక్తి చేసి అందరినీ ఆకట్టుకుటన్నాడు. అప్పర్ బెర్త్ మీద చిన్న పాటి కూలర్ ఉంచి, ఛార్జింగ్ సాకెట్ లో దాని ప్లగ్ పెట్టి ఆన్ చేశాడు. షర్ట్ విప్పి పక్కన పడేసి, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా హాయిగా నిద్రపోయాడు. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న మరో ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియో చూడండి:

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అరే.. ఈ ఆలోచన మనకెందుకు రాలేదని కొందరు.. “స్లీపర్ కోచ్‌ను ఏసీ కోచ్ గా మార్చేశావ్‌.. నీ ఐడియాకు ఓ దండం గురూ అని మరొకరు కామెంట్‌ చేశారు. కొందరు మాత్రం.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో జరిమానా విధించాలి. అప్పుడే ఇతరులు రైల్వే నిబంధనలను ఉల్లంఘించరు అని మరో వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.