Viral Video: పాకిస్తాన్‌ విమానాన్ని చుట్టుముట్టిన ఇసుక తుఫాన్‌… పైలట్‌కు ఎక్కడో సుడి ఉన్నట్టుంది…

విమాన ప్రయాణానికి ఉండే క్రేజే వేరు. తక్కువ సమయంలో గమ్య స్థానంలో చేరడానికి చాలా మంది డబ్బులెక్కువైనా ఫ్లైట్‌ జర్నీనే ఆశ్రయిస్తుంటారు. అయితే విమాన ప్రయాణం ఎంత సుఖంగా ఉంటుందో తేడా వస్తే మాత్రం అంతకు మించిన డేంజర్‌లో పడిపోతారు. అన్ని అనుకూలిస్తే చేరాల్సిన గమ్యానికి త్వరగా...

Viral Video: పాకిస్తాన్‌ విమానాన్ని చుట్టుముట్టిన ఇసుక తుఫాన్‌... పైలట్‌కు ఎక్కడో సుడి ఉన్నట్టుంది...
Karachi Flight Sandstorm

Updated on: May 27, 2025 | 4:10 PM

విమాన ప్రయాణానికి ఉండే క్రేజే వేరు. తక్కువ సమయంలో గమ్య స్థానంలో చేరడానికి చాలా మంది డబ్బులెక్కువైనా ఫ్లైట్‌ జర్నీనే ఆశ్రయిస్తుంటారు. అయితే విమాన ప్రయాణం ఎంత సుఖంగా ఉంటుందో తేడా వస్తే మాత్రం అంతకు మించిన డేంజర్‌లో పడిపోతారు. అన్ని అనుకూలిస్తే చేరాల్సిన గమ్యానికి త్వరగా చేరుకోవడంలో ఎలాంటి డౌట్‌ లేదు. కానీ, ఏమైనా తేడా వచ్చిందా అంతే సంగతులు. ముఖ్యంగా వెదర్‌లో ఏమాత్రం అనుకూలించకపోయినా ఫ్లైట్‌ జర్నీ డేంజరస్‌గా మారుతుంది.

తుఫాన్‌లు, గాలి దుమారం, పొగమంచు వంటి సంఘటనలు పైలెట్లకు ఛాలెంజ్‌ను విసురుతుంటాయి. వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంటేనే టేకాఫ్, ల్యాండింగ్ సాఫీగా సాగుతుంది. వాతావరణం అనుకూలించక గమ్యస్థానానికి చేరుకోకుండానే మధ్యలోనే హఠాత్తుగా ల్యాండ్‌ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల వడగళ్ల తుఫాన్‌లో చిక్కుకున్న ఇండిగో విమానంలోని ప్రయాణికులు ఎంతటి భయంకర పరిస్థితులను అనుభవించారో చూశాం. తాజాగా పాకిస్థాన్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అలాంటి భయంకర అనుభవమే ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం ఇసుక తుఫాన్‌లో చిక్కుకుంది. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు భారీ కుదుపులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మే 24న కరాచీ నుంచి లాహోర్‌కు ఫ్లై జిన్నా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బయల్దేరింది. లాహోర్‌లో ఆ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో హఠాత్తుగా ఇసుక తుఫాన్‌ చుట్టుముట్టింది. గాలి దుమారంతో కూడిన ఇసుక తుఫాన్‌ దాడి చేయడంతో విమానం కాసేపు బ్యాలెన్స్ తప్పినట్లయింది. తుఫాన్ ధాటికి విమానం మొత్తం కుదుపులకు గురయింది. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కొందరు ఏడుస్తూ, మరికొందరు ప్రార్థనలు చేస్తున్న దృశ్యాల వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లాహోర్ విమానాశ్రయం రన్‌వే మీద ల్యాండ్‌ చేయాలని పైలట్‌ ప్రయత్నించాడు. ల్యాండింగ్ సాధ్యం కాదని తేలడంతో అక్కడే గాల్లో పలు రౌండ్లు కొట్టిన విమానం తిరిగి కరాచీకి వెళ్లిపోయింది. అక్కడ పరిస్థితి అనుకూలంగానే ఉండడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ భయంకర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

వీడియో వైరల్: