Viral Video: బాలయ్య పాటా మజాకా.. వర్షంలో అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము రేపిన తాత.. చూస్తే ఫిదా అయిపోతారంతే..

|

Jul 18, 2021 | 8:31 PM

Viral Video: వాన చినుకులకు ప్రకృతే పరశించిపోతుంది. ఇక మానవాళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలకరి జల్లులను..

Viral Video: బాలయ్య పాటా మజాకా.. వర్షంలో అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము రేపిన తాత.. చూస్తే ఫిదా అయిపోతారంతే..
Dance
Follow us on

Viral Video: వాన చినుకులకు ప్రకృతే పరశించిపోతుంది. ఇక మానవాళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలకరి జల్లులను ఆస్వాధించడం.. వానలో తడవడం అంటే చాలా మంది ఇష్టపడుతారు. ఇక తొలకరి జల్లుల సమయంలో వీచే మట్టివాసన పరిమళాలను పీల్చుకుని మరికొందరు పరవశించిపోతారు. వానకున్న మహత్యం అలాంటిది మరి. సాధారణ మూడ్‌లో ఉంటేనే.. ఇంత ఫీలింగ్ కలిగితే.. అసలు లోకమే తెలియని మైకంలో మునిగిపోయినప్పుడు తమకు ఇష్టమైన వాన వస్తే పరిస్థితి ఏంటి. ఆ జోరు వానలో.. తమకు ఇష్టమైన నటుడికి చెందిన మాంచి ఊపు తెప్పించే పాట వస్తే.. ఆహా.. రచ్చ రచ్చే ఇక. ఓ వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఆ వ్యక్తి.. జోరు వానలో అద్భుతమైన పాటకు గొడుగు పట్టుకుని డ్యాన్స్ ఇరగదీశాడు. పాటకు తగ్గట్లుగా తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ చుట్టుపక్కన వారిని ఆకట్టుకున్నాడు. మద్యం మత్తులో వేసినప్పటికీ.. దుమ్మురేపాడనే చెప్పాలి.

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. మద్యం సేవించిన ఓ వ్యక్తి జోరువానలో గొడుగు పట్టుకుని అలా వెళ్తున్నాడు. అంతలో బాలయ్య నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని ‘‘స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన.. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా’’ అంటూ అద్భుతమైన మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. అంతే ఇక.. మాంచి మైకంలో ఉన్న ఆ వ్యక్తి బాలయ్య పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ డ్యాన్స్‌ కుమ్మేశాడు. ‘‘వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా.. నీలో.. మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల…’’ అంటూ వచ్చిన సమయంలో ఆ వ్యక్తి హావభావాలు పరిశీలిస్తే.. అతను ఏ స్థాయిలో పరవశించిపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా.. కొందరు అతని డ్యాన్స్‌ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంలో అదికాస్తా వైరల్‌ అయ్యింది.

Viral Video:

Also read:

Chittoor: మదనపల్లిలో దారుణం.. గోడౌన్‌లో యువకుడి నిర్బంధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Mahabubabad: ఎలుకల పాలైన రెండున్నర లక్షల రూపాయలు.. బాధితుడికి అండగా నిలిచిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్..

Telangana Corona: తెలంగాణకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు..