Viral Video: ఓ మై గాడ్.. ఎంత టాలెంటెడ్ ఉన్నావ్.. కట్టెపుల్లలు కావు.. అవి కొండచిలువలు సామీ

|

Jun 14, 2024 | 1:14 PM

రెండు పెద్ద పైథాన్‌లను పట్టుకుని మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. అతడు తన చేతిలో ఒక కొండచిలువను మరో పైథాన్‌ను భుజంపై వేసుకుని మెట్రో ట్రైన్‌లో కులాసాగా కూర్చున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ వివరాలు..

Viral Video: ఓ మై గాడ్.. ఎంత టాలెంటెడ్ ఉన్నావ్.. కట్టెపుల్లలు కావు.. అవి కొండచిలువలు సామీ
Viral
Follow us on

రెండు పెద్ద పైథాన్‌లను పట్టుకుని మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. అతడు తన చేతిలో ఒక కొండచిలువను మరో పైథాన్‌ను భుజంపై వేసుకుని మెట్రో ట్రైన్‌లో కులాసాగా కూర్చున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అతడ్ని తిట్టిపోస్తున్నారు. ప్రమాదకరమైన పాములను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకెళ్లడం ఎంతవరకు సబబు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోను మే 6వ తేదీన ‘factsclip’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు దీనికి 23.4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 9 లక్షలకు పైగా వ్యూవర్స్ లైకులు కొట్టారు. ఇక వీడియోను పరిశీలనగా చూస్తే.. అతడి పక్కన కూర్చున్న ఓ మహిళ.. ఆ పైథాన్‌లను చూసి భయపడుతున్నట్టు మనకు అర్ధమవుతుంది. తోటి ప్రయాణీకులను చూస్తుంటే.. ఆ ప్రాంతంలో ఇదంతా కామన్ అన్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారు.. అన్నది తెలియదు. అయితే ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది, లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి