Viral Video: పోలా.. అదిరిపోలా.. చేపలు పట్టేందుకు కొంగ కొత్త ప్లాన్..

|

Oct 14, 2021 | 11:50 AM

ప్రతి వేటగాడు తన వేటను వేటాడేందుకు ఓ ప్రత్యేక శైలిని కలిగి ఉంటాడు. కొందరు వేల పన్ని వేటాడితే.. మరికొందరు ఎర వేసి చేపను పట్టుకుంటారు. ఈ సూత్రాన్ని జంతువులు, పక్షులు కూడా అచ్చుగుద్దినట్లుగా ఫాలో...

Viral Video: పోలా.. అదిరిపోలా.. చేపలు పట్టేందుకు కొంగ కొత్త ప్లాన్..
Heron Using Bait As A Tool
Follow us on

ప్రతి వేటగాడు తన వేటను వేటాడేందుకు ఓ ప్రత్యేక శైలిని కలిగి ఉంటాడు. కొందరు వేల పన్ని వేటాడితే.. మరికొందరు ఎర వేసి చేపను పట్టుకుంటారు. ఈ సూత్రాన్ని జంతువులు, పక్షులు కూడా అచ్చుగుద్దినట్లుగా ఫాలో అవుతున్నాయి.  అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొంగ వేటను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న వీడియోలో నది ఒడ్డున ఒక కొంగ చేపలు పట్టేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చేపల కోసం ఒంటికాలుపై జపం చేయకుండా.. మనుషుల మాదిరిగానే చేపలను పట్టేందుకు ఎర విసిరింది. మనుషులలాగే తాను చేపలు పట్టగల శక్తి ఉందంటూ నిరూపించుకుంది. దీని కోసం కొంగ పదేపదే నీటిలో ధాన్యాన్ని విసిరింది. అది విసిరిన ఎరకు చేపలు వచ్చాయి. ఆపై అకస్మాత్తుగా చేపపై దాడి చేసి దాని నోటిలో పట్టుకుంటుంది. కొంగ వేట వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది దీనిపై సరదాగా స్పందించడానికి ఇష్టపడుతున్నారు.


మీ సమాచారం కోసం ఈ ఫన్నీ వీడియోను IFS అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు, ‘ఫిషింగ్ కోసం ఎరను ఒక సాధనంగా ఉపయోగించే కొంగ’ అనే శీర్షికను పెట్టారు. వీడియోను పోస్ట్ చేసి కేవలం 29 సెకన్ల ఈ వీడియోను 10 వేల మందికి పైగా చూశారు. దీనితో పాటు చాలా మంది ఈ పక్షి తెలివితేటలను ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..

Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం

SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..