Viral Video: వాయమ్మో ఏందీ అమ్మాయి ఇట్టా రెచ్చిపోయింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం సర్వసాధారణం. ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా.. వేలాది వీడియోలు సోషల్ మీడియాలో..

Viral Video: వాయమ్మో ఏందీ అమ్మాయి ఇట్టా రెచ్చిపోయింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Viral Video

Updated on: Feb 10, 2023 | 8:29 AM

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం సర్వసాధారణం. ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా.. వేలాది వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక అమ్మాయి బైక్ స్టంట్‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా అబ్బాయిలు బైక్‌లపై ఎక్కువ స్టంట్స్ చేస్తుంటారు. రోడ్లపై అడ్డదిడ్డంగా బైక్స్ నడుపుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా తెగ రెచ్చిపోతున్నారు. తామేమీ తక్కువ తిన్నామా? అంటూ బైక్స్‌పై హల్ చల్ చేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి బైక్‌ను పాము కంటే దారుణంగా మెలికలు తిప్పుతూ నడిపింది. ఆమె అలా నడిపటం ఇక్కడ మ్యాటర్ కాదు.. అలా నడిపి మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడేందుకు కారణమైంది. అదే ఇప్పుడు పెద్ద మ్యాటర్ అయ్యింది.

ఈ వీడియోలో ఓ అమ్మాయి రోడ్డుపై బైక్ నడుపుతూ స్టంట్స్ చేస్తోంది. ఇంతలో ఆమె వెనుకాలే వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. దాంతో ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న బైక్ రైడర్ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటన అంతా వెనుక నుంచి వస్తున్న బైకర్ హెల్మెట్‌కు అమర్చిన కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ‘అమ్మా తల్లీ జర చూసుకోమ్మా’ అంటూ పంచ్‌లు వేస్తున్నారు. ఈ వీడియోను చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.

ఇది ఎక్కడ జరిగిందంటే..
ఈ వీడియో ఇండియాకు సంబంధించినది కాదు. బ్రెజిల్‌కు దేశానికి చెందినదిగా గుర్తించారు. అక్కడి వీధుల్లో అమ్మాయిలు స్టంట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..