పాత కాలంలో ప్రజలు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే.. బట్టలతో పాటుగా ఆహారం, వంట చేసుకోవటానికి కావాల్సిన వంటగది పాత్రలు సహా వెంట తీసుకువెళ్లేవారు..అవన్నీంటిని ఎలా సర్దుకుని వెళ్లేవారో చూపించే ఓ అద్భుతమైన వీడియో వైరల్ అవుతోంది. కానీ, ప్రస్తుతం ప్రయాణల స్టైల్ మారింది. ప్రయాణీకులు హోటళ్లలోనే బస, తినడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ, పురాతన కాలంలో ప్రజలు క్యాపింగ్ ఎలా చేసేవారు? వారు తమ వంటగదిని ఎలా నిర్వహించారు.. ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..అంతేకాదు.. అప్పట్లో ప్రజల వంటగదిలోని మొత్తం సామాగ్రి అంతా కూడా ఒకే బకెట్‌లోకి సరిపోయేదిగా ఉంది.. ఈ బకెట్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఇందులో వంటగది పాత్రలన్నీ సాధారణ బకెట్‌లో సర్దినట్టుగా చూడవచ్చు.
ఇంతకు ముందు ప్రయాణం చేయడానికి స్థోమత లేని కాలంలో ఎద్దుల బండ్లను వాడేవారు, నెలల తరబడి ప్రయాణం చేసేవారు, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తినడానికి, త్రాగడానికి ఈ ప్రత్యేకమైన బకెట్‌ను ఉపయోగించేవారు. అన్ని వంటగది పాత్రలను సులభంగా ఒక బకెట్‌లో ఉంచవచ్చని వీడియోలో చూడవచ్చు. ఇందులో మొత్తం 58 పాత్రలను పెట్టారు.. ప్లేట్, పాన్, గిన్నె, గ్లాస్ మొదలైనవి ఇందులో ఉంటాయి. ఈ వీడియో చాలా మంది వీక్షిస్తున్నారు. పాత్రలను ఉంచే ఈ విధానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
మనం ఎంత ముందుకు సాగినా పాత కాలం వేరు అని ఒకరు రాశారు. ఈ రోజుల్లో ప్రజలు దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తే, ప్లాస్టిక్ వాడకం తగ్గుతుందని, దానివల్ల పర్యావరణానికి జరిగే నష్టం తగ్గుతుందని ఒకరు రాశారు. ఈ టెక్నాలజీ బయటకు వెళ్లకూడదని ఒకరు రాశారు. ఈరోజు కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది అని ఒకరు రాశారు.
ఈ వీడియో indiandesitraveler అనే ఖాతాతో షేర్ చేయబడింది. కేవలం ఒక్కరోజులోనే దాదాపు 8 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 4 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. చాలా మంది ఈ బకెట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. అంటే ఆధునిక కాలంలో కూడా ప్రజలు పాత జీవన విధానాన్ని అనుసరించాలని కోరుకుంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..