
మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొండ చివరి అంచున ఉన్న ఇళ్లు నేలకూలాయి. భండూప్ ఖిండిపాడ ప్రాంతంలో ఇళ్లు కూలిపోయాయి. కొండపై అడుగుల ఎత్తులో ఉంది. దానిపై అంతే పెద్ద రక్షణ గోడ నిర్మించబడింది. ఈ కొండ జనసాంద్రతతో నిండి ఉంది. ఈ సాయంత్రం, ఈ పగుళ్ల వల్ల ఈ గోడపై ఉన్న ఐదు ఇళ్ళు కూలిపోయాయి. కొంతమంది స్థానికులు ఈ భయానక దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో బంధించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పగుళ్లతో పాటు ఐదు ఇళ్ళు కూలిపోయినప్పటికీ, వారిని సకాలంలో ఖాళీ చేయించారు, కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
మరోవైపు రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. అంధేరిలో రద్దీగా ఉండే సబ్‌వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అంధేరీ సబ్‌వేని అధికారులు మూసివేశారు. భారీ వర్షాలు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
Location “Nirmala chawl, dagline road, tin dargah near gaytari Vidya mandir Ambechi Bharani, Bhandup West
Dear @mybmc @mybmcWardS what actions taken by your side.#bhandup #Saiyaara pic.twitter.com/eZ68yYVb5y
— Dildar Idrish Ansari (@DildarIdrish) July 22, 2025
రానున్న 24 గంటల పాటు ముంబై, కొంకణ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD చెప్పింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. థానే, పాల్‌ఘర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై సమీప ప్రాంతాల ప్రజలు సముద్ర తీరానికి వెళ్లొద్దని హెచ్చరించారు.
అటు ఢిల్లీలోనూ ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వానతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.