Snake Vs Hen: ఈ సృష్టిలో సర్వైవ్ అవ్వాలంటే పోరాటం తప్పదు. ఒక జీవికి ఆకలి వేసిందంటే.. ఇంకో జీవికి ఆయువు మూడినట్లే… ఇది జంగిల్ రూల్. ఆహారం సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, ఇతరుల జీవుల నుంచి తన బిడ్డల్ని బ్రతికించుకోవడానికి పోరాటం సాగించాల్సిందే. చేతులెత్తేస్తే.. చిక్కటి మాంసం అయిపోతావ్ అంతే. తెగువ ఉంటే.. బ్రతుకు సాగుతుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో బలమైన ప్రత్యర్థులు ఎదురైనప్పుడు కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తోంది. తనకంటే పెద్దదైన, ప్రమాదకర జీవి దాడి నుంచి తప్పించుకోవడానికి ఓ కోడి చూపిన తెగువ, చురుకుతనం నెటిజన్ల(Netizens)ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఓ కోడి మరుగు ప్రాంతం చూసుకుని అక్కడ గుడ్లను పొదుగుతోంది. కాగా అటుగా వచ్చిన ఓ త్రాచుపాము(Cobra) కోడిపై దాడి చేసి గుడ్లను మింగేద్దామని ప్రయత్నించింది. అయితే మాములుగా అయితే పామును చూడగానే కోడి పారిపోయేది. కాని తన పసిగుడ్డులు ఇంకా అక్కడే ఉన్నాయి. దీంతో సదరు కోడి ధైర్యం ప్రదర్శించింది. అటాక్ చేస్తోన్న పాముకు కౌంటర్ ఇచ్చింది. కోడి అస్సలు వెనక్కి తగ్గకుండా పోరాడుతూ ఉండటంతో.. షాకైన పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా పుట్టని బిడ్డలను కాపాడుకోడానికి కోడి చూపిన తెగువ.. పోరాట తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రాణం మీదికొస్తే మనకంటే బలవంతులను అయినా ధీటుగా ఎదుర్కోవడం తప్పదని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. మరి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
వీడియో చూడండి…
Also Read: Nellore District: పొలం పనులు చేస్తుండగా.. బయటపడ్డ 6 బీరువాలు, ఒక బైక్.. ఎంక్వైరీ చేయగా