Viral Video: వామ్మో.. నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!

Deadly Black Mamba Snake Video: వన్యప్రాణుల ప్రపంచంలో ఇలాంటి సాహసాలు అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చినప్పటికీ, సరైన శిక్షణ, అవగాహన లేకుండా విషసర్పాలతో చెలగాటం ఆడటం ముమ్మాటికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఈ వైరల్ వీడియో నెటిజన్లకు ఒకవైపు వినోదాన్ని ఇస్తూనే, మరోవైపు ప్రకృతిలోని క్రూరత్వాన్ని కళ్లకు కట్టింది.

Viral Video: వామ్మో.. నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
Deadly Black Mamba Snake Video

Updated on: Jun 10, 2026 | 9:20 AM

Deadly Black Mamba Snake Video: ప్రకృతిలో కొన్ని దృశ్యాలు చూస్తేనే ఒంటికి చెమటలు పడతాయి. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాముతో ఒక వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దట్టమైన అడవిలో, ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా భారీ నల్ల తాచు పామును (బ్లాక్ మాంబా) చేతులతో పట్టుకుని ఇద్దరు చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

అడవి పొదల్లోంచి మృత్యువును బయటకు లాగి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్న దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ఎవరికైనా గుండె గుభేల్మనేలా చేస్తోంది. ఒక దట్టమైన, తడితో కూడిన అడవి ప్రాంతంలో పొదలు, బండరాళ్ల మధ్య దాక్కుని ఉన్న ఒక భారీ నల్లటి పామును పొడవాటి జుట్టు ఉన్న ఒక వ్యక్తి ఎంతో సునాయాసంగా బయటకు లాగాడు.

ఆ పాము సాధారణమైనది కాదు.. అత్యంత వేగంగా స్పందిస్తూ, క్షణాల్లో ప్రాణాలు తీయగల విషపూరితమైన ‘బ్లాక్ మాంబా’ జాతికి చెందినదిగా నెటిజన్లు గుర్తిస్తున్నారు. అంత పెద్ద సర్పం కళ్లముందు కనిపిస్తేనే ప్రాణాలు పోయే భయం వేస్తుంది, కానీ ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రం దాన్ని ఒక ఆటబొమ్మలా పట్టుకోవడం గమనార్హం.

ముఖానికి అంత దగ్గరగా.. ఊహకందని ప్రమాదకర విన్యాసాలు..

ఆ వ్యక్తి పామును బయటకు తీయడమే కాకుండా, ఓ లేడీ సహాయంతో దాని పూర్తిగా పైకి లేపి రకరకాలుగా తిప్పడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆ భయంకరమైన పాము తల భాగాన్ని తన ముఖానికి అత్యంత సమీపంలోకి తీసుకెళ్లాడు.

ఒక్క మిల్లీసెకను తేడా వచ్చినా, ఆ పాము కాటు వేస్తే ప్రాణాలు కాపాడుకోవడం అసాధ్యం. కానీ, ఆ హ్యాండ్లర్ ముఖంలో కనీసం భయం అన్నదే కనిపించలేదు. పాముకు కోపం రాకుండా, దాన్ని ఎలా నియంత్రించాలో తెలిసిన నిపుణుడిలా అతడు వ్యవహరించినప్పటికీ, ఆ దృశ్యాలు మాత్రం చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

నెటిజన్ల షాక్.. అసలు ప్రాణాలంటే అంత చులకనా?

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. కేవలం కొన్ని గంటల్లోనే వేలాది వీక్షణలను సొంతం చేసుకుని వైరల్‌గా మారింది. ఈ భీకర దృశ్యాలను చూసిన నెటిజన్లు భయాందోళనలతో కూడిన కామెంట్లు పెడుతున్నారు.

“అసలు ఆ పాము కరిస్తే బతికే అవకాశాలు ఎంత శాతం ఉంటాయి? ఎందుకు ఇలాంటి ప్రాణాంతకమైన పనులతో సాహసాలు చేస్తారు?” అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే “ఇది సాహసం కాదు, ఆత్మహత్యాసదృశ్యం” అని కొట్టిపారేస్తున్నారు. సదరు వ్యక్తికి పాములపై ఉన్న పట్టును కొనియాడుతున్నప్పటికీ, ఇలాంటి పనులు ఇతరులు ప్రయత్నిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us