Viral Video: సింహం తినే మూడ్‌లో ఉంది..లేదంటేనా… నీ రీల్స్‌ పిచ్చికి అదే ఆఖరి రోజు అయితుండె!

కొంత మంది రీల్స్‌ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రాణాంతకమైన పాములు, పులులతోటి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తూ మృత్యువాత పడుతున్నారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా నుండి...

Viral Video: సింహం తినే మూడ్‌లో ఉంది..లేదంటేనా... నీ రీల్స్‌ పిచ్చికి అదే ఆఖరి రోజు అయితుండె!
Reel With Lion

Updated on: Aug 04, 2025 | 5:25 PM

కొంత మంది రీల్స్‌ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రాణాంతకమైన పాములు, పులులతోటి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తూ మృత్యువాత పడుతున్నారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా నుండి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో ఒక యువకుడు సింహం దగ్గరకు వెళ్లి తన ప్రాణాలను పణంగా పెట్టడం కనిపించింది. ఈ వీడియో నెట్టింట మరింత వైరల్ అవుతోంది. ఆ యువకుడి బాధ్యతారహిత చర్యపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఈ సంఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా తలాజాలోని బాంబోర్ గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇది గిర్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతం ఆసియా సింహాల జనాభాకు ప్రసిద్ధి చెందింది. వైరల్ వీడియోలో, ఒక సింహం దాని ఎరను తింటున్నట్లు మీరు చూడవచ్చు. అప్పుడు ఒక యువకుడు దాని దగ్గరగా వెళ్లి తన మొబైల్‌లో వీడియోను రికార్డ్ చేయడం ప్రారంభించాడు.

కానీ సింహం ఆ యువకుడిని చూసిన వెంటనే అది తన ఆహారాన్ని వదిలి కోపంతో అతని వైపు గర్జిస్తుంది. అతని వైపు కొన్ని అడుగులు దూసుకొచ్చింది. ఇది చూసి భయపడిన ఆ యువకుడు వెననకు వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. వీడియోలో, మరికొందరు దూరం నుండి అరుస్తూ సింహాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వినవచ్చు. దీని కారణంగా యువకుడి ప్రాణాలు దక్కాయి. అతను అక్కడి నుండి తప్పించుకోగలిగాడు.

వీడియో చూడండి:

 

ఈ వీడియో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. యువకుడి ఈ చర్యను ప్రజలు ‘మూర్ఖత్వం’ అంటూ పోస్టులు పెడుతున్నారు. యువకుడిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.