
పేదరికం ఒక వ్యక్తిని ఏదైనా చేయిస్తుంది. కొంతమంది రోడ్డు పక్కనే ఫుట్‌పాత్ మీద చాపకింద, గోనెసంచుల కింద పడుకునే వారిని కూడా చూస్తుంటాం. మరికొంతమందికి అవి కూడా దొరకని దుస్థితలో నేలపైనే పడుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి వీడియో వేగంగా వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు జాలిపడరు కానీ పగలబడి నవ్వుతారు. అవును, దీనికి కారణం ఆ వ్యక్తి శవంలా నిద్రపోతున్నాడు. అతన్ని చూసిన ప్రజలు అతన్ని శవం అని భావించి పోలీసులకు, అంబులెన్స్‌కు కాల్ చేశారు. కానీ అక్కడి జరిగింది చూసి షాక్ అయ్యారు.
వీడియోలో రోడ్డు పక్కన ఒక గోనె సంచిలో ఒక వ్యక్తి ఎలా నిద్రపోతున్నాడో మీరు చూడవచ్చు. అతన్ని చూసిన ఎవరైనా అతన్ని శవం అని అనుకుంటారు. ఆ దారిన వెళుతున్న వ్యక్తులు కూడా అలాగే భావించారు. కొద్దిసేపటికే అక్కడ జనం గుమిగూడారు. పోలీసులు కూడా వచ్చారు, అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేశారు. ఆ సమయంలో అక్కడి అలికిడి పెరగడంతో ఆ వ్యక్తి అకస్మాత్తుగా లేచి, తన గోనె సంచిని తీసుకొని ఏమీ జరగనట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ మీరు మమ్మల్ని సరిగ్గా నిద్రపోనివ్వరు అంటూ ఓ డైలాగ్ వదిలాడు. హఠాత్తుగా జరిగిన ఆ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మరికొందరు నవ్వాపుకోలేకపోయారు.
कितने तेजस्वी लोग हैं 😁
लोग इकठ्ठा हों गए पुलिस भी आ गई सब सोच में पड गये किसी ने कोई लाश फेंक दी है पुलिस भी अपने काम में लग गई एम्बुलेंस को भी फोन करके बुला लिया जब शोर ज्यादा होने लगा तो आदमी उठकर चल पड़ा और बोला तुम लोग ठीक से सोने भी नहीं देते बताओ गलती किसकी हैं। pic.twitter.com/BtBYaOLIr2
— Shivani Sahu (@askshivanisahu) August 12, 2025
ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. వినియోగదారులు ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఇచ్చారు. ఒక వినియోగదారుడు, ‘అందుకే మొదట సరిగ్గా దర్యాప్తు చేయాలని అంటారు అంటూ పోస్టు పెట్టారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తితే, మొదట రాయి విసిరి ప్రయత్నించండి మరొకరు రాశారు. దొమలు కుట్టకుండా అనుకుంటా ఓ పేదవాడు సంచిలో నిద్రపోతున్నాడు అని పోస్టుపెట్టారు.