పిచ్చి పీక్ స్టేజ్ లో బిజీ రోడ్డు మధ్యలో పరుపుమీద నిద్రపోతున్న వ్యక్తి.. నెట్టింట్లో వీడియో సంచలనం

బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్డుపై జరిగిన ఒక వింత సంఘటన కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డుమీద వాహనాలు వెళ్తున్నాయి. వాటి మధ్య ఒక వ్యక్తి పరుపు మీద హాయిగా నిద్రపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఇటువంటి బాధ్యతారహిత ప్రవర్తనను సహించలేమని అంటున్నారు.

పిచ్చి పీక్ స్టేజ్ లో బిజీ రోడ్డు మధ్యలో పరుపుమీద నిద్రపోతున్న వ్యక్తి.. నెట్టింట్లో వీడియో సంచలనం
Viral Video
Image Credit source: X/@karnatakaportf

Updated on: Sep 20, 2025 | 4:41 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి జనాలు చేయగలిగినదంతా చేస్తున్నారు. కొని సార్లు ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేయడం, మెట్రో లోపల పాడటం, ప్రమాదకరమైన విన్యాసాలను చేయడం ద్వారా ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గత కొంత కాలంగా రోడ్డు మధ్యలో రీల్స్ తయారు చేయడం ఫ్యాషన్‌గా మారింది. ప్రజలు రీల్స్ కోసం ట్రాఫిక్‌ను ఆపడమే కాకుండా తమ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో పరుపు వేసుకుని పడుకున్న కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు చెబుతున్నారు. ఈ వీడియోలో రోడ్డు మధ్యలో ఒక పరుపు పరుచుకుని ​​హాయిగా నిద్రిస్తున్న వ్యక్తి కనిపిస్తుంది. నిద్రపోతు కాళ్ల మీద కాలు అడ్డంగా పెట్టుకుని మరీ నిద్రపోతున్నాడు. దీంతో రోడ్డుమీద వాహనాలు ఆగిపోయాయి. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయబడింది. ఇది ప్రజలను రంజింపజేసింది. మరోకొంత మంది ఆగ్రహానికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

ఆ వ్యక్తి వాహనాల వేగాన్ని ఆపాడు.

వీడియోను షేర్ చేస్తూ “బెంగళూరులోని రద్దీగా ఉండే వీధుల్లో వాహనాల గందరగోళం చూడడానికే దిగ్భ్రాంతికరంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో పరుపుపై ​​నిద్రపోతూ కనిపించాడు. దీనివల్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఆపి అతను కదిలే వరకు వేచి ఉండాల్సి వచ్చింది అని యూజర్ క్యాప్షన్ రాశారు.

“ఇటువంటి ప్రవర్తన పూర్తిగా నిర్లక్ష్యం.. ఆమోదయోగ్యం కాదు. ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నా లేదా ఉద్దేశపూర్వకంగా ఇలా చేసినా.. ఇది చాలా బాధ్యతారహితమైన చర్య. ఇలాంటి చర్యల వలన అతని ప్రాణాలు ప్రమాదంలో పడడమే కాదు.. ప్రయాణీకులకు కూడా ప్రమాదం కలిగిస్తుంది. ఏదైనా వాహనం ప్రమాదవశాత్తూ అతన్ని ఢీకొంటే.. ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించాడు.

రీల్ కోసం ఇలా చేశావా..!

చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాల కామెంట్స్ చేస్తూ స్పందించారు. కొందరు ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో ఖచ్చితంగా తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు అనిపిస్తోందని.. అంటే.. మరికొందరు ఆ వ్యక్తి రీల్ తయారు చేయడానికి అలా చేశాడని అనుమానిస్తున్నామని చెప్పారు.

వీడియోను ఇక్కడ చూడండి

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..